ప్రస్తుత సమాజంలో మనుషులు ఉరుకులు.. పరుగుల జీవితం గడుపుతున్నారు. ఆరోగ్యంపై శ్రద్ధ వహించడం లేదు. దీంతో అనారోగ్యం పాలై ఆస్పత్రుల చుట్టూ తిరుగుతున్నారు. శారీరక శ్రమ లేకపోవడంతో షుగర్, బీపీ తదితర వాటితో బాధపడుతున్నారు. పట్టణాలు, పల్లెల ప్రజలకు సంపూర్ణ ఆరోగ్యాన్ని అందించాలని కేంద్ర ప్రభుత్వం ఉచిత యోగాను ప్రవేశపెట్టింది. ఇందుకోసం ఆయుష్ మిషన్ ద్వారా రాష్ట్రవ్యాప్తంగా 421 ఆయుష్ వైద్య ఆరోగ్య కేంద్రాల్లో యోగా కేంద్రాలను మంజూరు చేసింది. ఆయుష్ ఆస్పత్రులకు అనుబంధంగా నిర్మించిన యోగా కేంద్రాలు చాలా వరకు నిర్మాణాలు పూర్తయినా ప్రారంభానికి నోచుకోవడం లేదు. దీంతో ప్రభుత్వ లక్ష్యం నీరుగారిపోతుంది. – మెదక్ డెస్క్
Comments
Please login to add a commentAdd a comment