సంగారెడ్డి టౌన్: ధాన్యం కొనుగోలు ప్రక్రియ సాఫీ గా జరగాలని కలెక్టర్ డాక్టర్ శరత్ సంబంధిత అధికారులను ఆదేశించారు. గురువారం కలెక్టరేట్‌లో వరి ధాన్యం కొనుగోళ్లపై అధికారులు, కొనుగోలు కేంద్రాల ఇన్‌చార్జీలు, వ్యవసాయ శాఖ ఏఈఓలు, ట్రాన్స్‌పోర్టు కాంట్రాక్టర్లు, ఎంఎల్‌ఎస్ పాయింట్ ఇన్‌చార్జీలతో ఏర్పాటు చేసిన సన్నాహక సమావేశానికి ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ధాన్యం కొనుగోళ్లు విషయమై ఎలాంటి ఫిర్యాదులు రాకుండా తగు చర్యలు తీసుకోవాలని చెప్పారు. రైతుల నుంచి చిన్న ఫిర్యాదు అందినా చర్యలు తప్పవని హెచ్చరించారు. ప్రతి గ్రామంలో కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేయా లని సూచించారు. జిల్లాలో 208 ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నామని, కనీస మౌలిక వసతులను కల్పించాలని అధికారులకు సూచించారు. ధాన్యం సేకరణకు అవసరమైన గన్నీ బ్యాగులను అందుబాటులో ఉంచాలన్నారు. నాణ్యత ప్రమాణాలను పాటిస్తూ ధాన్యం కొను గోలు చేయాలని స్పష్టం చేశారు. ధాన్యం ఎప్పటికప్పుడు కొనాలని, కొన్న ధాన్యానికి ఆన్‌లైన్‌లో నమోదు చేయాలన్నారు. ట్రాన్స్‌పోర్టు, కాంట్రాక్టర్లతో సమన్వయం చేసుకొని వెంటనే కొనుగోలు చేసిన ధాన్యాన్ని మిల్లర్లకు పంపాలన్నారు. గ్రేడ్ ఏ రకం ధాన్యం ధర క్వింటాలుకు రూ.2,203, సాధారణ రకం ధాన్యానికి రూ.2,183 లభిస్తుందని తెలిపారు.ఎక్కడ ఎలాంటి పొరపాట్లకు తావివ్వరాదని సూచించారు. అదనపు కలెక్టర్ మాధురి, సివిల్ సప్లయ్ డీఎం సుగుణాబాయి, డీఎస్‌ఓ వనజాత, డీఆర్‌ఓ శ్రీనివాసరావు, వ్యవసాయ శాఖ జేడీ నరసింహారావు, డీసీఓ ప్రసాద్, వ్యవసాయ శాఖ ఏఈవోలు, రవాణా కాంట్రాక్టర్లు, డీటీసీఎస్‌లు, కొనుగోలు కేంద్రాల ఇన్‌చార్జీలు పాల్గొన్నారు.
ఓటు హక్కుపై అవగాహన కల్పించాలి
సంగారెడ్డి టౌన్ : జిల్లాలో స్వీప్ కార్యక్రమాలను మరింత విస్తృతం చేయాలని, ఓటు హక్కు కలిగిన ప్రతి ఒక్కరు తమ ఓటు హక్కును వినియోగించుకునేలా అవగాహన కల్పించాలని జిల్లా ఎన్నికల అధికారి శరత్ అన్నారు. కలెక్టరేట్లో అదనపు కలెక్టర్ చంద్రశేఖర్‌తో కలిసి సంబంధిత అధికారులతో జిల్లా స్వీప్ యాక్షన్ ప్లాన్‌పై సమీక్షించి, పలు సూచనలు చేశారు. కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వ శాఖలు, ప్రభుత్వేతర సంస్థలు, అన్ని పరిశ్రమలలో ఓటరు చైతన్య వేదికలను ఏర్పాటు చేయాలన్నారు. ప్రతి ఆర్గనైజేషన్‌లో పనిచేస్తున్న అధికారులలో ఒక రిని నోడల్ అధికారిగా నియమించాలని ఆదేశించారు.
న్యూస్‌రీల్
ఎన్నికల విధులు పూర్తి అవగాహనతో చేయాలి
ఎన్నికల విధులు పూర్తి అవగాహనతో నిర్వర్తించినప్పుడే ఎలాంటి పొరపాట్లు జరగకుండా ఉంటాయని డాక్టర్ శరత్ అన్నారు. మాస్టర్ ట్రైనర్లు ప్రతి అంశంపై త్వరగా అవగాహన చేసుకోవాలన్నారు. ఎన్నికల సిబ్బంది శిక్షణలకు సంబంధించిన షెడ్యూల్ సిద్ధం చేయాలని రిటర్నింగ్ అధికారులను కలెక్టర్ ఆదేశించారు.