
నగదును అందజేస్తున్న ఎస్‌ఐ రామానాయుడు, తదితరులు
న్యాల్‌కల్ మండల పరిధిలోని రత్నాపూర్ గ్రామంలో మైబు సభానీ దర్గా ఉత్సవాల్లో భాగంగా గురువారం నిర్వహించిన కుస్తీ పోటీలు అలరించాయి. ఉదయం ప్రారంభమైన కుస్తీ పోటీల్లో జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచే కాకుండా కర్నాటక, మహారాష్ట్రాలకు చెందిన మల్లయోధులు పాల్గొన్నారు. కుస్తీ పోటీల్లో సుమారు 60 మంది పైల్వాన్లు హాజరయ్యారు. చివరకు మహారాష్ట్రాలోని ఉద్గీర్‌కు చెందిన కుతూబ్‌కు మొదటి బహుమతి వరించింది. కుతూబ్‌కు హద్నూర్ ఎస్‌ఐ రామానాయుడు వెండి కడియం అందజేశారు. ఇతర విజేతలకు ఎస్‌ఐతోపాటు గ్రామ పెద్దలు బహుమతులు ప్రధానం చేశారు. కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ రవి, శ్రీరామ్ ప్రజా సేనా అధ్యక్షుడు జనార్దన్ గౌడ్, జైనోద్దీన్, షబ్బీర్, అహ్మద్, చాకలి శివకుమార్, శ్రీన్, హన్మంత్ తదితరులు పాల్గొన్నారు.
–న్యాల్‌కల్(జహీరాబాద్

తలపడుతున్న మల్లయోధులు
Comments
Please login to add a commentAdd a comment