
దరఖాస్తులు స్వీకరిస్తున్న ఆవుల రాజిరెడ్డి
హత్నూర (సంగారెడ్డి): కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చిన ఆరు గ్యారంటీలను 100 రోజుల్లో అమలు చేస్తామని పీసీసీ కార్యదర్శి ఆవుల రాజిరెడ్డి, మెదక్ డీసీసీ అధ్యక్షుడు రెడ్డిపల్లి ఆంజనేయులు గౌడ్ అన్నారు. గురువారం హత్నూర మండలం సిరిపురం, తెల్లరాళ్లలలో నిర్వహించిన ప్రజాపాలన కార్యక్రమంలో వారు పాల్గొని మాట్లాడారు. సోనియా గాంధీ వల్లనే తెలంగాణ వచ్చిందని, బీఆర్‌ఎస్ పార్టీ వల్ల పదేళ్లపాటు రాష్ట్రం అభివృద్ధికి నోచుకోలేదని అన్నారు. అలాగే.. అనారోగ్యానికి గురైన హత్నూర గ్రామ సర్పంచ్ వీరస్వామి గౌడ్ ను వారు పరామర్శించారు. కార్యక్రమంలో పీసీసీ మైనారిటీ సెల్ రాష్ట్ర కార్యదర్శి అకీమ్, సర్పంచులు వెంకటేశం, ఆంజనేయులు, కాంగ్రెస్ మండల శాఖ అధ్యక్షుడు కృష్ణ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment