
సాక్షిప్రతినిధి, సంగారెడ్డి: సంగారెడ్డి బీజేపీ టికెట్‌పై ఉత్కంఠ వీడటం లేదు. నామినేషన్ల దాఖలుకు కేవలం మూడు రోజులే గడువున్నప్పటికీ అభ్యర్థి ఎవరో తేలకపోవడంతో ఆ పార్టీ శ్రేణుల్లో అయోమయం నెలకొంది. మరోవైపు పోటీ పడుతున్న ఆశావహులకు నిరీక్షణ తప్పడం లేదు. పార్టీ నాయకులు రాజేశ్వర్‌రావు దేశ్‌పాండే, పులిమామిడిరాజులిద్దరూ ఆశిస్తున్నారు. బండి సంజయ్ ఆశీస్సులతో ఒకరు, ఈటల రాజేందర్ సపోర్టుతో మరొకరు గట్టి ప్రయత్నాలు చేస్తున్నారు. చివరకు టికెట్ ఎవరికి దక్కుతుందనే అంశంపై కమలం శ్రేణుల్లో ఉత్కంఠ నెలకొంది. మరోవైపు ఈ టికెట్ రేసులో పార్టీ నాయకులు శివరాజ్‌పాటిల్ కూడా ఉండేవారు. ఇటీవల ఆయన పార్టీని వీడి బీఆర్‌ఎస్‌లో చేరారు. దీంతో దేశ్‌పాండే, పులిమామిడిరాజు మధ్య పోటీ నెలకొంది. జిల్లాలో బీజేపీకి కొంత పట్టున్న నియోజకవర్గాల్లో సంగారెడ్డి ఒకటి. గతంలో ఈ స్థానాన్ని బీజేపీ కై వసం చేసుకుంది. సంగారెడ్డి, సదాశివపేట మున్సిపాలిటీల్లో కౌన్సిలర్ స్థానాలను సైతం గెలుచుకుంది. నియోజకవర్గంలో పలు మండలాల్లోనూ కొంత ఓటు బ్యాంక్ ఉంది. ఇంకా టికెట్ ఖరారు చేసేందుకు జాప్యం జరుగుతుండటం కూడా పార్టీ శ్రేణులను నిరాశకు గురిచేస్తోంది.
అన్ని చోట్ల ప్రకటన కానీ..
జిల్లాలో ఒక స్థానానికి తప్ప మిగతా వాటికి బీజేపీ అభ్యర్థులను ప్రకటించింది. మొదటి, మూడో జాబితాల్లో జిల్లాలోని పటాన్‌చెరు,ఖేడ్, అందోల్, జహీరాబాద్ టికెట్లను ఖరారు చేసింది. కానీ సంగారెడ్డి విషయంలో మాత్రం ఇంకా స్పష్టత రాలేదు.
ప్రచారంలో వెనుకంజ..
సంగారెడ్డి నియోజకవర్గం టికెట్ల ఖరారు విషయమై జాప్యం జరుగుతుండగా బీజేపీ ప్రచారంలో కాస్త వెనుకబడే పరిస్థితులు నెలకొన్నాయి. ఇప్పటికేబీఆర్‌ఎస్ అభ్యర్థి చింతా ప్రభాకర్ నియోజకవర్గంలోని అన్ని గ్రామాలను రెండు, మూడు సార్లు చుట్టేశారు. అన్ని కుల సంఘాలతో ఆత్మీయ సమ్మేళనాలను కూడా నిర్వహించారు. ప్రత్యార్థి పార్టీల్లోని కీలక నాయకులను బీఆర్‌ఎస్‌లో చేర్చుకోవడం మరింత పకడ్బందీగా ఎన్నికల వ్యూహాన్ని అమలు చేస్తున్నారు. ఇటు కాంగ్రెస్ అభ్యర్థి జగ్గారెడ్డి కూడా ప్రచారానికి శ్రీకారం చుట్టారు. ఇప్పటికే ఆ పార్టీ జాతీ య అధ్యక్షుడు ఖర్గే సమావేశాన్ని సంగారెడ్డిలో నిర్వహించారు. ఒక్క బీజేపీ మాత్రం ఇంకా టికెట్ ఖరారు కాకపోవడంతో ప్రచారం ముందుకు వెళ్లలేకపోతోంది.
న్యూస్‌రీల్
బీజేపీ సంగారెడ్డి టికెట్‌పై
కొనసాగుతున్న ఉత్కంఠ
నేడో, రేపో తుదిజాబితా ప్రకటన
నేడో, రేపో ప్రకటన
రాష్ట్రంలో బీజేపీ తరపున పోటీ చేయనున్న అభ్యర్థుల తుది జాబితా మంగళ, బుధవారం కానీ ప్రకటించే అవకాశాలు కనిపిస్తున్నాయి. జనసేన పార్టీకి కేటాయించే నియోజకవర్గాల విషయంలో ఇప్పటికే ఓ స్పష్టత రాగా తుదిజాబితా ప్రకటనకు మార్గం సుగమమైందనే అభిప్రాయం పార్టీ ముఖ్యనేతలు చెబుతున్నారు.

సిలిండర్లతోపాటు నిందితుడినిచూపుతున్న పోలీసులు

రాజేశ్వర్‌రావు దేశ్‌పాండే పులిమామిడి రాజు
