
బీజేపీలో చేరుతున్న నాయకులు
కొండపాక(గజ్వేల్): కుటుంబ పాలనకు చరమ గీతం పాడుదామని గజ్వేల్ బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ పిలుపునిచ్చారు. ఆదివారం మండలంలోని లకు డారం, ఎర్రవల్లి, బొబ్బాయిపల్లి, కొండపాక, తిప్పారం, బందారం, సింగారం, చిన్న కిష్టాపూర్ గ్రామాలకు చెందిన కాంగ్రెస్, బీఆర్‌ఎస్‌లకు చెందిన 250 మంది యువత బీజేపీలో చేరారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ అభివృద్ధి పేరిట వేల కోట్ల రూపాయలను సీఎం కేసీఆర్ కుటుంబం దోచుకుందని ఆరోపించారు. తనను గెలిపిస్తే గజ్వేల్‌ను అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తానన్నారు. కార్యక్రమంలో మండల అధ్యక్షులు మన్నెం శశిధర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్
Comments
Please login to add a commentAdd a comment