
ప్రభుత్వాస్పత్రి రోడ్‌లో ప్రమాదకరంగా..
పచ్చని చెట్లు ప్రగతికి మెట్లు.. అనేది నానుడి. అయితే ఇది అన్ని రకాల చెట్లుకు వర్తించదని కోనోకార్పస్ వృక్షాలు రుజువు చేస్తున్నాయి. పట్టణంలోని ప్రధాన రహదారుల్లో, పార్క్‌లలో కోనో కార్పస్ చెట్లు విపరీతంగా నాటడడంతో అవి ఏపుగా పెరిగి ఇప్పుడు ప్రజలకు సమస్యలను తెచ్చిపెడుతున్నాయి. ఈ చెట్ల కారణంగా శ్వాసకోశ వ్యాధులు వస్తున్నట్లు పట్టణవాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ చెట్ల తొలగించాలని పలుమార్లు అధికారులకు చెప్పినా పట్టించుకోవడంలేదని పలు కాలనీ ప్రజలు పేర్కొన్నారు. అలాగే కరీంనగర్‌రోడ్‌లో కరెంట్ తీగలకు అడ్డుగా ఉన్నాయని మున్సిపల్ అధికారులు, విద్యుత్ అధికారులు కొన్ని చెట్లను నరికించారు. ఇలానే పూర్తి స్థాయిలో పట్టణంలోని అన్ని కోనో కార్పస్ చెట్లను తొలగించాలని డిమాండ్ చేస్తున్నారు.
–సాక్షి, స్టాఫ్ ఫొటోగ్రాఫర్,సిద్దిపేట

కరీంనగర్ రోడ్‌లో నరికివేసిన చెట్లు
Comments
Please login to add a commentAdd a comment