
అక్షింతల కలషాలతో జెడ్పీవైస్ చైర్మన్ ప్రభాకర్ తదితరులు
జిన్నారం(పటాన్‌చెరు) : అయోధ్య రామ మందిరం నుంచి వచ్చిన స్వామివారి అక్షింతలను మండల కేంద్రం జిన్నారంలో మంగళవారం ఊరేగించారు. మండలంలోని 30 గ్రామాలకు చెందిన అక్షింతలతో కూడిన కలశాలను స్థానిక హనుమాన్ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం రామ భక్తులు కలషాలను తలపై పెట్టుకుని వీధుల్లో ఊరేగించారు. కార్యక్రమంలో జెడ్పీ వైస్ చైర్మన్ ప్రభాకర్, ఎంపీపీ రవీందర్‌గౌడ్, దేవాలయ కమిటీ చైర్మన్ భోజిరెడ్డి, నిర్వాహకులు రవి, ఆనంద్‌చారి, రాజేందర్‌రెడ్డి, కరుణాసాగర్‌రెడ్డి, బ్రహ్మేందర్, అనిల్‌రెడ్డి పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment