
శివయోగి ఆశీస్సులు తీసుకుంటున్న సంగప్ప
●పూజ ఫలప్రదమవ్వాలి
●ఓటును వడసి పడదాం
●ఢీఎస్పీ అభ్యర్థి సైతం..
వట్‌పల్లి(అందోల్): నారాయణఖేడ్ ఎమ్మెల్యే అభ్యర్థిగా సంగప్పను ప్రకటించారు. శుక్రవారం మండల పరిధిలోని దుద్యాల సర్వేశ్వరపూరీ క్షేత్రంలో ఆయన పూజలు చేశారు సర్వేశ్వరపూరి క్షత్ర పీఠాధిపతి అంబికా శివయోగి మహరాజ్ ఆశీస్సులు తీసుకునేందుకు ఇక్కడి వచ్చినట్లు తెలిపారు. ప్రజాసేవ చేయాలనే సంకల్పంతో ముందుకు వెళ్లి ఎన్నికల్లో విజయం సాధిస్తానని ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్రంలో బీఆర్‌ఎస్ అవినీతి, అరాచకాలు పెరిగిపోవడంతో ప్రజలు కేసీఆర్ పాలనపై విసుగు చెందుతున్నారన్నారు.
ఝరాసంగం(జహీరాబాద్): బర్దీపూర్ దత్తగిరి మహరాజ్ ఆశ్రమంలో బీజేపీ జహీరాబాద్ ఎమ్మెల్యే అభ్యర్థి రాంచందర్ పూజలు చేశారు. అధిష్టానం టికెట్ కేటాయించగా.. శుక్రవారం మండల పరిధిలోని బర్దీపూర్ ఆశ్రమంలో ప్రత్యేక పూజలు చేశారు. ఆపై ఎన్నికల ప్రచారం నిర్వహించారు. బీజేపీ ప్రభుత్వంతోనే గ్రామాల అభివృద్ధి సాధ్యం అవుతుందన్నారు.
జిన్నారం(పటాన్‌చెరు): ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ ప్రచారాల్లో చిత్రవిచిత్రాలు చోటుచేసుకుంటున్నాయి. జిన్నారం మండలం గుమ్మడిదలలో ఎమ్మెల్యే మహిపాల్‌రెడ్డికి మద్దతుగా మాజీ సర్పంచ్ సురేందర్‌రెడ్డి ప్రచారం నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా ఒక హోటల్‌లో వడ తయారు చేశారు.
హోటల్‌లో వడలు తయారు చేస్తున్న
సురేందర్‌రెడ్డి తదితరులు
నారాయణఖేడ్: నియోజకవర్గ ధర్మసమాజ్ పార్టీ (డీఎస్పీ) అభ్యర్థి అతిగే జీవన్ బీఫామ్ అందుకున్నారు. శుక్రవారం హైదరాబాద్‌లో ఉన్న పార్టీ కార్యాలయంలో రాష్ట్ర అధ్యక్షుడు డా.విశారధన్ మహారాజ్ అందజేశారు. ఈ సందర్భంగా జీవన్ మాట్లాడారు. రాష్ట్రంలో 90 శాతం ఉన్న ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు న్యాయం జరగాలంటే డీఎస్పీ అధికారంలోకి రావాల్సి ఉందని అన్నారు.

దత్తగిరిలో పూజలు చేస్తున్న రాంచందర్


బీఫామ్ అందుకుంటున్న జీవన్