రైలు ఢీకొని వ్యక్తి మృతి
గజ్వేల్‌రూరల్: రైలు ఢీకొని మృతి చెందిన ఘటన గజ్వేల్ మండలం బంగ్లా వెంకటాపూర్ శివారు (బేగంపేట పోలీస్‌స్టేషన్ పరిధి)లో ఆదివారం చోటు చేసుకుంది. కామారెడ్డి రైల్వే ఎస్‌ఐ తావూ నాయక్, బేగంపేట పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. జార్ఖాండ్ రాష్ట్రంలోని సిండేఘా తాలుకా, గిర్ద ప్రాంతానికి చెందిన రాజ్‌కుమార్ భారీక్(24) మండల పరిధిలోని బంగ్లా వెంకటాపూర్ సమీపంలో జరుగుతున్న భూగర్భ సొరంగం పనుల్లోని కూలీలకు వంట చేసేందుకు ఏడాది క్రితం వచ్చాడు. వినికిడి లోపం ఉన్న రాజ్‌కుమార్ ఆదివారం కాలకృత్యాల కోసం వెళ్లి తిరిగి వస్తున్న క్రమంలో సిద్దిపేట–సికింద్రాబాద్ మార్గంలో నడుస్తున్న రైలు ఢీకొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. రైలు ప్రమాద విషయం తెలుసుకున్న కామారెడ్డి రైల్వే ఎస్‌ఐ తావూనాయక్ ఘటనా స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.
Comments
Please login to add a commentAdd a comment