మద్దూరు(హుస్నాబాద్): దూల్మిట్ట మండలంలోని కూటిగల్ గ్రామంలో ఫిబ్రవరిలో జరిగే సమ్మక్క, సారలమ్మ జాతర పోస్టర్‌ను జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జాతరకు వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలుగకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని నిర్వాహకులను సూచించారు.
దక్షిణ భారత వైజ్ఞానిక
ప్రదర్శనకు జిల్లా ప్రాజెక్టులు
ప్రశాంత్‌నగర్(సిద్దిపేట)/మర్కూక్(గజ్వేల్): దక్షిణ భారత వైజ్ఞానిక ప్రదర్శనకు జిల్లా నుంచి రెండు ప్రాజెక్టులు ఎంపికయ్యాయని జిల్లా విద్యాశాఖ అధికారి శ్రీనివాస్‌రెడ్డి, జిల్లా సైన్స్ అధికారి శ్రీనివాస్‌లు శుక్రవారం తెలిపారు. జిల్లా నుంచి రాష్ట్ర స్థాయికి 10 ప్రాజెక్టులు ఎంపికవ్వగా అందులో రెండు ప్రాజెక్టులు దక్షిణ భారత వైజ్ఞానిక ప్రదర్శనకు ఎంపికయ్యాయన్నారు. మర్కూక్ మండల పరిధిలోని జెడ్పీహెచ్‌ఎస్ దామరకుంటలో 9 తరగతి చదువుతున్న విద్యార్థిని సుష్మ, సిద్దిపేట అర్బన్ మండల పరిధిలోని స్ప్రింగ్ డల్స్ పాఠశాలలో చదువుతున్న రితేష్‌ల ప్రాజెక్టులు ఎంపికయ్యాయన్నారు. ఈ ప్రాజెక్టులు దక్షిణ భారత వైజ్ఞానిక ప్రదర్శనలో రాణిస్తే, జాతీయ స్థాయి వైజ్ఞానిక ప్రదర్శనకు ఎంపిక అవుతారని తెలిపారు. విద్యార్థులను గైడ్ టీచర్లు బ్రహ్మయ్య, కృష్ణకుమార్‌లను అభినందించారు.
బాల నేరస్తులకు న్యాయ సహాయం
సిద్దిపేటకమాన్: నేషనల్ లీగల్ సర్వీసెస్ అథారిటీ ఆదేశాల మేరకు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో జిల్లా సీనియర్ సివిల్ జడ్జి, జిల్లా లీగల్ సర్వీసెస్ అథారిటీ సెక్రటరీ స్వాతిరెడ్డి లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ న్యాయవాదులతో శుక్రవారం సిద్దిపేట కోర్టులో సమావేశం నిర్వహించారు. జైలులో ఉన్న బాల నేరస్తులను గుర్తించడం, వారికి న్యాయ సహాయం అందించడం అనే అంశాలపై చర్చించారు. ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ.. జైలులో ఉన్న 18 నుంచి 22 ఏళ్ల వయసు ఉన్న ఖైదీలను గుర్తించి న్యాయ సహాయం అందిస్తామని పేర్కొన్నారు. పాన్ ఇండియా ప్రచారంలో భాగంగా ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు చెప్పారు.
మద్యం మత్తులో ఆత్మహత్య
వెల్దుర్తి(తూప్రాన్): మద్యం మత్తులో రైతు ఆత్మహత్య చేసుకున్న ఘటన వెల్దుర్తి పంచాయతీ పరిధి ఎల్కపల్లి గ్రామంలో చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన రైతు కానికె వెంకటేశ్(45) శుక్రవారం ఉదయం లేవలేదు. ఇంటి తలుపులు మూసి ఉండడాన్ని గమనించి చుట్టుపక్కల వారు వచ్చి చూడగా ఉరేసుకొని కనిపించాడు. తాగుడుకు బానిసై మద్యం మత్తులో వెంకటేశ్ ఆత్మహత్యకు పాల్పడినట్లు కుటుంబసభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్‌ఐ మధుసూదన్‌గౌడ్ వెల్లడించారు. మృతుడికి భార్య, ముగ్గురు కుమారులు ఉన్నారు.

మాట్లాడుతున్న న్యాయమూర్తి స్వాతిరెడ్డి

పోస్టర్ ఆవిష్కరిస్తున్న ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి, జాతర నిర్వాహకులు
Comments
Please login to add a commentAdd a comment