
మహిళలతో మాట్లాడుతున్న ఎమ్మెల్యే రఘునందన్‌రావు
రాయపోలు/మిరుదొడ్డి(దుబ్బాక): మూడేళ్లలో ఎన్నో సమస్యలు పరిష్కరించానని, తనను మరోమారు ఎమ్మెల్యేగా గెలిపిస్తే నియోజకవర్గాన్ని మరింత అభివృద్ధి పథంలోకి తీసుకెళ్తానని దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్‌రావు అన్నారు. మండలంలోని రాంసాగర్, ముంగీసపల్లి, వీరానగర్ తదితర గ్రామాలలో గురువారం ఆయన ఇంటింటికీ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. కేసీఆర్ చెప్పే మాయమాటలకు మోసపోవద్దని, తొమ్మిదేళ్లలో తెలంగాణను అప్పుల పాలు చేశారని విమర్శించారు. ఈ సందర్భంగా ఆయా గ్రామాలకు చెందిన పలువురు బీజేపీలో చేరారు. అదేవిధంగా అదేవిధంగా అక్బర్‌పేట–భూంపల్లి మండలం రుద్రారం గ్రామానికి చెందిన పలువురు బీఆర్‌ఎస్ మండల నాయకులు, ముదిరాజ్ సంఘం సభ్యులు ఎమ్మెల్యే సమక్షంలో బీజేపీలో చేరారు. కార్యక్రమంలో నాయకులు మల్లన్నగారి భిక్షపతి, మాదాసు వెంకట్‌గౌడ్, రవీందర్‌రెడ్డి, చెన్నగౌని వెంకటేశ్‌గౌడ్, రాజాగౌడ్, సత్యపాల్‌రెడ్డి, రాజిరెడ్డి రమేష్ ఉన్నారు.
అభివృద్ధి చేస్తా.. ఆశీర్వదించండి
దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్‌రావు
Comments
Please login to add a commentAdd a comment