ఎన్నికల ప్రవర్తనా నియమావళి కచ్చితంగా అమలయ్యేలా ఎన్నికల సంఘం పకడ్బందీ ఏర్పాట్లు చేసింది. నాయకులు ఓటర్లను ప్రభావితం చేయాలని చూస్తే కఠినంగా వ్యవహరించనుంది. అదే విధంగా ప్రభుత్వ ఉద్యోగులు సైతం ప్రచారాలకు దూరంగా ఉండాలి. ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలులో ఉన్న సమయంలో ప్రభుత్వ ఉద్యోగులు ప్రత్యక్షంగా కానీ, పరోక్షంగా కానీ రాజకీయ పార్టీల కార్యకలాపాల్లో పాల్గొనడం నియమావళి ఉల్లంఘన కిందికి వస్తుంది. జిల్లాలో ఉద్యోగుల ప్రవర్తన తీరు గురించి అక్కడక్కడ వస్తున్న ఫిర్యాదులపై ఎన్నికల అధికారులు ప్రత్యేక నిఘా ఉంచారు.