
సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి: టికెట్ల కోసం చివరి వరకు ప్రయత్నించి భంగపడిన ఆశావహులు తగ్గేదేలే అంటున్నారు. ఆయా పార్టీల అభ్యర్థులకు దీటుగా నామినేషన్లు వేస్తున్నారు. ప్రధానంగా కాంగ్రెస్, బీజేపీల్లో ఈ పరిస్థితి నెలకొంది. నారాయణఖేడ్ నియోజకవర్గం కాంగ్రెస్ టికెట్ కోసం పీసీసీ ఉపాధ్యక్షుడు సురేష్‌షెట్కార్, డాక్టర్ సంజీవరెడ్డి అన్ని ప్రయత్నాలు చేశారు. కానీ, చివరకు అధిష్టానం షెట్కార్ వైపు మొగ్గు చూపింది. దీంతో తీవ్ర అసంతృప్తికి గురైన సంజీవరెడ్డి. తన ముఖ్య అనుచరులతో సమావేశమై బరిలోకి దిగాలని నిర్ణయించారు. ఈ మేరకు గురువారం నామినేషన్ దాఖలు చేశారు. టికెట్ దక్కిన షెట్కార్ కూడా నామినేషన్ వేశారు. నర్సాపూర్‌లోనూ కాంగ్రెస్ పార్టీ ముఖ్యనేతలు ఇద్దరు నామినేషన్ వేయడం రసవత్తరంగా మారింది. ఈ టికెట్ ఆవుల రాజిరెడ్డికి దక్కగా ఆయన నామినేషన్ వేశారు. ఈ అభ్యర్థిత్వం కోసం గాలి అనిల్‌కుమార్ కూడా బరిలోకి దిగాలని భావిస్తున్నారు. బుధవారం తన నామినేషన్ పత్రాలను రిటర్నింగ్ అధికారికి అందజేశారు. ఆవుల రాజిరెడ్డికి ఇచ్చిన బీ–ఫారం రద్దు చేసి, తనకు సీ–ఫారం ఇస్తుందని గాలి అనిల్‌కుమార్ ప్రకటించడం ఆసక్తికరంగా మారింది.
బీఆర్‌ఎస్‌కు తప్పిన రెబల్ బెడద
బీఆర్‌ఎస్ పార్టీ రెబల్ అభ్యర్థుల కిరికిరి లేకుండా చూసుకుంది. ఉమ్మడి జిల్లాలో పలు స్థానాలకు ఇద్దరు, ముగ్గురు బీఆర్‌ఎస్ టిక్కెట్లు ఆశించారు. పలుచోట్ల టిక్కెట్లు దక్కని నేతలు తీవ్ర అసమ్మతిని వ్యక్తం చేశారు. సంగారెడ్డి, నర్సాపూర్, జహీరాబాద్ తదితర చోట్ల అసమ్మతి రాగం ఆలపించిన నేతలందరిని ఆ పార్టీ అధినాయకత్వం ఆదిలోనే బుజ్జగించింది. రెండు నెలల క్రితమే టికెట్లను ప్రకటించిన గులాబీ పార్టీ ఎన్నికల నోటిఫికేషన్ జారీ తేదీ వరకు ఎక్కడా అసమ్మతి లేకుండా జాగ్రత్త పడింది. నామినేషన్ల గడువు ముగిసే నాటికి కూడా ప్రత్యర్థి పార్టీల్లో అసమ్మతి సెగలు రగులుతుంటే బీఆర్‌ఎస్‌లో మాత్రం ఆయా చోట్ల ఐక్యతా రాగాన్ని ఆలపిస్తున్నారు.
బుజ్జగింపులకు లొంగుతారా?
కాంగ్రెస్, బీజేపీల టికెట్లు దక్కనప్పటికీ నామినేషన్లు వేసిన అసమ్మతి నేతలు చివరి వరకు బరిలో ఉంటారా? లేక ఆయా పార్టీల అధినాయకత్వం బుజ్జగింపులకు లొంగుతారా? అనే తేలాల్సి ఉంది. కాంగ్రెస్‌లోని అసమ్మతి నేతలను ఆ పార్టీ అధినాయకత్వం బుజ్జగిస్తున్నట్లు తెలిసింది. అయితే ఈ రెబల్ అభ్యర్థులు చివరి వరకు పోటీలో కొనసాగుతారా? లేక తమ నామినేషన్లను ఉపసంహరించుకుంటారా? అనేది నామినేషన్ల ఉపసహరణ 15వ తేదీన తేలనుంది.
న్యూస్‌రీల్
తగ్గేదేలే.!
టిక్కెట్ ఆశించి భంగపడిన ఆశావహులు
నామినేషన్ వేసిన కాంగ్రెస్, బీజేపీ అసమ్మతి నేతలు
ఉత్కంఠగా మారిన అధిష్టానాల నిర్ణయం
రెబల్స్ లేకుండా బీఆర్‌ఎస్ జాగ్రత్తలు
బీజేపీలోనూ ఇదే తీరు
ఒకటీ రెండు స్థానాల్లో బీజేపీలోనూ ఇలాంటి పరిస్థితే నెలకొంది. సంగారెడ్డి టికెట్‌ను ఆశించిన రాజేశ్వర్‌రావు దేశ్‌పాండే, పులిమామిడి రాజు ఇద్దరూ గురువారం నామినేషన్లు వేయడం బీజేపీలో చర్చనీయాంశంగా మారింది. అయితే ఈ టికెట్‌పై అధినాయకత్వం ఇంకా నిర్ణయాన్ని ప్రకటించలేదు. అయినప్పటికీ ఇద్దరూ బీజేపీ తరపున నామినేషన్లు దాఖలు చేయడం ఆసక్తికరంగా మారగా, బీ–ఫారం ఎవరికి దక్కుతుందోనని కమలం పార్టీ నేతల్లో ఉత్కంఠ నెలకొంది.

ఆర్‌ఎం ప్రభులతను సన్మానిస్తున్న కార్మికులు
Comments
Please login to add a commentAdd a comment