పోలీస్‌శాఖలో బదిలీల జాతరకు తెరలేచింది. జిల్లాలో ఒకేసారి 87 మంది ఎస్సైలను బదిలీ చేశారు. ఎస్పీగా శివకుమార్ బాధ్యతలు తీసుకున్నప్పటినుంచి ఎస్సైల బదిలీలపై కసరత్తు నిర్వహిస్తుండగా ఎన్నడూ లేనంత ఒకేసారి ఇంత మందిని బదిలీ చేసి రికార్డు సృష్టించారు.
కరీంనగర్ క్రైం, న్యూస్‌లైన్ : జిల్లా పోలీస్‌శాఖలో బదిలీల కుదుపు. గతంలో ఎన్నడూ లేని విధంగా 87 మందిని ఒకేసారి బదిలీ చేస్తూ ఎస్పీ శివకుమార్ బుధవారం రాత్రి ఉత్తర్వులు జారీచేశారు. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఈ బదిలీల్లో రాజకీయ, పైరవీల మార్కు స్పష్టంగా కనిపించింది. కొత్తగా శిక్షణ పూర్తి చేసుకున్న 37 మంది ఎస్సైలకు పోస్టింగ్ ఇవ్వడంతోపాటు రెండేళ్ల ఉద్యోగకాలం పూర్తి చేసుకున్న వారిని బదిలీ చేశారు. రెండు నెలల క్రితం పోస్టింగ్ ఇచ్చిన వారిని సైతం మార్చారు. పనితీరు బాగున్నా ప్రాధాన్యత కల్పించలేదని పలువురు ఎస్సైలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పైరవీలు లేని వారికి మంచి పోస్టింగులు దక్కలేదనే ప్రచారం జరుగుతోంది. కొత్తగా శిక్షణ పూర్తి చేసుకున్న ఎస్సైలకు పోస్టింగ్‌లు ఇవ్వడంతో రానున్న ఎన్నికలు వీరికి పెద్ద సవాల్‌గా మారనున్నాయి.
భారీగా ఎస్సైల బదిలీ
Published Thu, Jan 23 2014 3:21 AM | Last Updated on Sat, Sep 2 2017 2:53 AM
Advertisement
Advertisement