![Tea Stall Owner Distribute Milk For Children - Sakshi](/styles/webp/s3/article_images/2020/06/18/milk.jpg.webp?itok=6FH4-Rno)
పాలు తాగిస్తున్న శివకుమార్
శివకుమార్‌కి టీ స్టాల్ ఉంది. లాక్‌డౌన్‌కి ముందు రోజుకు 600 నుంచి 700 వరకు రాబడి ఉండేది. ఇప్పుడు సగానికి డౌన్ అయిపోయింది. అయితే అప్పటికి ఇప్పటికి డౌన్ కానిది ఒక్కటే. అతడిలోని ‘ఇచ్చే గుణం’. వంబన్‌లో అందరికీ తెలిసిన భగవాన్ టీ స్టాల్ అతడిదే. పిల్లలకు ఆవు పాలు ఉచితం అందులో. శివకుమార్ వయసు 42. మొదట్లో రైతు కూలీ. కన్న బిడ్డలకు పాలు కూడా కొనలేని రోజులు ఉన్నాయి అతడి జీవితంలో. మరొకరికి ఆ దుర్భరతను రానివ్వకూడదనుకున్నాడు. పేద రైతు కూలీలు ఎక్కువగా ఉండే వంబన్.. తమిళనాడులోని పుదుకొట్టయ్ జిల్లాలో ఉంది. ఆ ఊరి పిల్లలు పాలకు ఏడవకుండా శివకుమార్ ఉన్నాడు.
Comments
Please login to add a commentAdd a comment