
‘వింబుల్డన్’ విధులకు శివకుమార్
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రానికి చెందిన సీనియర్ ఐటీఎఫ్ సర్టిఫైడ్ హోల్డర్ జె. శివకుమార్ రెడ్డి వింబుల్డన్ గ్రాండ్‌స్లామ్‌లో లైన్‌మెన్ అఫీషియల్‌గా విధులు నిర్వర్తించేందుకు ఎంపికయ్యారు. రాష్ట్రంలో ఐటీఎఫ్ సర్టిఫైడ్ ఇంటర్నేషనల్ వైట్ బ్యాడ్జ్ కలిగిన ఏకైక అఫీషియల్ శివకుమార్ కావడం విశేషం.
ఈయన ఇప్పటికే కామన్వెల్త్ క్రీడలు, వరల్డ్ ఇస్లామిక్ గేమ్స్, డేవిస్‌కప్, ఫెడ్ కప్, ఆఫ్రో ఆసియా క్రీడలు, హాప్‌మన్ కప్, ఏటీపీ, డబ్ల్యూటీఏ వరల్డ్ టూర్ ఈవెంట్లు, ఏటీపీ చాలెంజర్, ఐటీఎఫ్ సీనియర్, జూనియర్స్ వంటి పలు టోర్నీలలో విధులు నిర్వహించారు. తాజాగా ప్రఖ్యాత వింబుల్డన్ టోర్నీకి ఎంపికవడంతో శివకుమార్‌ను శాట్స్ ఎండీ దినకర్‌బాబు, రాష్ట్ర టెన్నిస్ సంఘం సెక్రటరీ అశోక్ కుమార్ బుధవారం అభినందించారు.