బెంగళూరు: మనీ లాండరింగ్ కేసులో తమ ముందు హాజరుకావాలని కర్ణాటక కాంగ్రెస్ అధ్యక్షుడు డీకే శివకుమార్‌ను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ ఆదేశించింది. ఈడీ సమన్లు జారీచేయడంపై శివకుమార్ ఆగ్రహం వ్యక్తంచేశారు. ‘ కాంగ్రెస్ పార్టీ చేపట్టిన భారత్ జోడో యాత్ర ఇంకొద్ది రోజుల్లో కర్ణాటకలో ప్రారంభంకానుంది. రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలున్నాయి.
శాసన, రాజకీయ బాధ్యతలను నేను కచ్చితంగా నిర్వర్తించాలి. ఈడీకి సహకరించేందుకు నేను సిద్ధమే. కానీ, ఈ సమయంలో ఉద్దేశపూర్వకంగా ఈడీ సమన్లు పంపి వేధిస్తోంది’ అని శివకుమార్ గురువారం ట్వీట్‌చేశారు. ‘భారత్ జోడో యాత్ర ద్వారా కాంగ్రెస్‌కు వస్తున్న అపూర్వ ప్రజా మద్దతును చూసి ఓర్వలేక కర్ణాటకలో యాత్ర ఏర్పాట్లకు భంగం కల్గించేందుకే మోదీ సర్కార్ ఇలా ఈడీ(ఎలక్షన్ డిపార్ట్‌మెంట్) ఆఫ్ బీజేపీని రంగంలోకి దించింది’ అని ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కర్ణాటక ఇన్‌చార్జ్ రణ్‌దీప్ సూర్జేవాలా ఆరోపించారు.
(చదవండి: హిందీని బలవంతంగా రుద్ధితో ఊరుకోం)
Comments
Please login to add a commentAdd a comment