శివపల్లిలో కోడిపందేలపై.. ఎస్పీ సీరియస్ | S.P takeing serious action cock fight | Sakshi
Sakshi News home page

శివపల్లిలో కోడిపందేలపై.. ఎస్పీ సీరియస్

Published Fri, Jan 17 2014 4:37 AM | Last Updated on Sat, Sep 2 2017 2:40 AM

S.P takeing serious action cock fight

 పెద్దపల్లి, న్యూస్‌లైన్ : సంక్రాంతి పర్వదినం సందర్భంగా ఎలిగేడ్ మండలం శివపల్లిలో బుధవారం నిర్వహించిన కోడిపందే లపై ఎస్పీ శివకుమార్ సీరియస్ అయ్యారు. పెద్దపల్లి ఎమ్మెల్యే సీహెచ్.విజయరమణారావుతోపాటు వేలాది మంది ఈ పందేల్లో పాల్గొన్న విషయం తెలిసిందే.
 
 మూడు కిలోమీటర్ల దూరంలో ఉన్న సుల్తానాబాద్ స్టేషన్‌కు, 8కిలోమీటర్ల దూరంలో ఉన్న జూలపల్లి పోలీసులకు కోడి పందేల గురించి తెలియకపోవడంపై ఎస్పీ మండిపడినట్లు సమాచారం. దీనిపై విచారణ జరిపి మూడు రోజుల్లో నివేదిక సమర్పించాల్సిం దిగా పెద్దపల్లి డీఎస్పీ వేణుగోపాల్‌రావును ఆదేశించినట్లు తెలిసింది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement