శివ సాయికుమార్‌కు రజతం | Shiva Kumar gets Silver Medal in Taekwondo Championship | Sakshi
Sakshi News home page

శివ సాయికుమార్‌కు రజతం

Published Tue, Oct 9 2018 10:21 AM | Last Updated on Tue, Oct 9 2018 10:21 AM

Shiva Kumar gets Silver Medal in Taekwondo Championship - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: జాతీయ తైక్వాండో చాంపియన్‌షిప్‌లో తెలంగాణ కుర్రాడు సీహెచ్‌ శివ సాయికుమార్‌ మెరుగైన ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. జమ్మూ కశ్మీర్‌లోని ఎంఏ స్టేడియంలో జరిగిన ఈ టోర్నీలో రజతాన్ని గెలుచుకున్నాడు. ఈ టోర్నీలో రాష్ట్రం నుంచి నలుగురు క్రీడాకారుల బృందం పాల్గొనగా శివ సాయికుమార్‌ పతకాన్ని సాధించాడు. రాష్ట్ర జట్టుకు టి. బాలరాజు సారథ్యం వహించారు. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర తైక్వాండో సంఘం కార్యదర్శి అబ్దుల్‌ సత్తార్‌ జాతీయ స్థాయిలో పతకాన్ని సాధించిన సాయికుమార్‌ను అభినందించారు.   

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement