తైక్వాండో విజేత తెలంగాణ | Telangana Wins Taekwondo Championship | Sakshi
Sakshi News home page

తైక్వాండో విజేత తెలంగాణ

Published Mon, Sep 30 2019 10:09 AM | Last Updated on Mon, Sep 30 2019 10:09 AM

Telangana Wins Taekwondo Championship - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: సౌత్‌జోన్‌ తైక్వాండో, క్వాన్‌ కి డో చాంపియన్‌షిప్‌లో తెలుగు రాష్ట్రాల జట్లు సత్తా చాటాయి. సౌత్‌జోన్‌లోని పలు రాష్ట్రాల జట్లు పాల్గొన్న ఈ టోర్నీలో తొలి రెండు స్థానాలను దక్కించుకున్నాయి. టోర్నీలో అద్భుతంగా రాణించిన తెలంగాణ జట్టు చాంపియన్‌గా నిలవగా, ఆంధ్రప్రదేశ్‌ జట్టు రెండోస్థానాన్ని దక్కిం చుకుంది. కర్ణాటక, తమిళనాడు జట్లు వరుసగా మూడు, నాలుగు స్థానాలను సాధించాయి.

ఈ సందర్భంగా ఆదివారం బహుమతుల ప్రదానోత్సవం సరూర్‌నగర్‌ స్టేడియంలో జరిగింది. శాట్స్‌ చైర్మన్‌ అల్లిపురం వెంకటేశ్వర్‌ రెడ్డి ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొని విజేతలకు పతకాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో తైక్వాండో అంతర్జాతీయ ఆటగాడు జె. బాబులాల్‌ తదితరులు పాల్గొన్నారు.   

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement