సాక్షి, హైదరాబాద్: యూఎస్ వరల్డ్ ఓపెన్ తైక్వాండో చాంపియన్‌షిప్‌లో తెలంగాణ రాష్ట్ర క్రీడాకారిణి సంధ్య స్మిత సత్తా చాటింది. అమెరికాలోని ఆరిజిన్ కన్వెన్షన్ సెంటర్‌లో జరిగిన ఈ టోర్నీలో ఆమె పాల్గొన్న ప్రతీ విభాగంలోనూ పతకాన్ని కైవసం చేసుకుంది. సంధ్య అద్భుత ప్రదర్శనకు 2 స్వర్ణాలు, 1 రజతం, 2 కాంస్యాలు ఆమె వశమయ్యాయి. కిరోగి కటా ఈవెంట్, వెపన్స్ విభాగాల్లో స్వర్ణాలు గెలుచుకున్న సంధ్య... వ్యక్తిగత కిరోగి (ఫైట్) విభాగంలో రజతాన్ని సాధించింది. వ్యక్తిగత పంచ్, బ్రేకింగ్ చాంపియన్‌షిప్ విభాగాల్లో రెండు కాంస్య పతకాలను కైవసం చేసుకుంది.
Comments
Please login to add a commentAdd a comment