40 ఏళ్లు మాత్రమే బతుకుతాను.. డాక్టర్స్‌ మాటలతో డిప్రెషన్‌: గీతూ రాయల్‌ | Bigg Boss Fame Geetu Royal Went Depression | Sakshi

40 ఏళ్లు మాత్రమే బతుకుతాను.. డాక్టర్స్‌ మాటలతో డిప్రెషన్‌: గీతూ రాయల్‌

Apr 29 2024 12:45 PM | Updated on Apr 29 2024 1:00 PM

Bigg Boss Fame Geetu Royal Went Depression

బిగ్‌బాస్‌ షో ద్వారా గీతూ రాయల్‌ చాలా పాపులర్‌ అయింది. సీజన్‌ 6లో ఆడుగుపెట్టిన గీతూ ఊహించని విధంగా ఎలిమినేట్‌ అయింది. వాస్తవంగా ఆమె టిక్‌టాక్‌ వీడియోలతో వెలుగులోకి వచ్చింది. ఆ తర్వాత తనదైన స్టైల్లో పలు కొటేషన్‌లు చెబుతూ యూత్‌ను ఆకట్టుకుంది. ఆపై బిగ్‌ బాస్‌ సీజన్‌లకు రివ్యూలు చెప్పే స్థాయి నుంచి ఏడో సీజన్‌లో బిగ్‌బాస్‌ బజ్‌కు వ్యాఖ్యాతగా వ్యవహరించే రేంజ్‌కు చేరుకుని భారీగా ఫ్యాన్స్‌ను సంపాధించుకుంది.

తాజాగా గీతూ ఒక వీడియోను షేర్‌ చేసింది.. సుమారుగా 5 నెలల నుంచి తను ఓ సమస్యతో బాధపడుతున్నట్లు అందుకు సంబంధించి చికిత్స తీసుకుంటున్నట్లు తెలిపింది. ఈ క్రమంలో తను పడుతున్న అనారోగ్యానికి కారణాలు చెప్పింది. నేను గత ఐదు నెలలుగా బ్యాక్టిరియల్‌ ఇన్‌ఫెక్షన్‌తో బాధ పడుతున్నాను. 'దీనికి కారణం నేను బ్యాంకాక్‌ వెళ్లిన సమయంలో అనేక రకాల బొద్దింకలు, పురుగులు వంటి ఆహారపదార్థాలు తిన్నాను. అందువల్లే నేనే అనారోగ్యానికి గురైయాను అనుకుంటున్నాను. 

ఈ క్రమంలో మరో సందేహం కూడా ఉంది. ఒకసారి విజయవాడకు వెళ్లాను.. అక్కడ అమ్మవారి గుడి దగ్గరకు వెళ్లి కూడా దర్శించుకోకుండా వచ్చేశాను. ఇదీ కూడా కారణం కావచ్చని అనుకుంటున్నాను. ఈ రెండు సంఘటనల తర్వాతే నేను అనారోగ్యానికి గురికావడం జరిగింది. గత ఐదు నెలలుగా అనారోగ్యంతో ఇబ్బంది పడుతున్నాను. దీంతో చాలా డిప్రెషన్‌కు గురి కావడం జరిగింది.

మొదటగా నాకు ఒక గాయం అయింది. మందులు వాడుతున్నా కూడా అది తగ్గలేదు. ఫైనల్‌గా ఒక పెద్ద ఆసుపత్రికి వెళ్తే ఒక పరీక్ష ద్వారా అసలు విషయం తెలిసింది. బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ వచ్చిందని వైద్యులు చెప్పారు. దీనికి రెండేళ్ల పాటు ట్రీట్‌మెంట్‌ తీసుకోవాలని వైద్యులు చెప్పారు. ప్రతివారం ఒక ఇంజెక్షన్‌ కూడా తీసుకోవాలి. డాక్టర్‌లు చెప్పిన మాటలతో బాగా డిప్రెషన్‌కు వెళ్లిపోయాను. ప్రస్తుతం అయితే కొంతమేరకు బాగానే ఉన్నాను.' అంటూ గీతూ చెప్పింది.

అలాంటి పొరపాటు చేస్తే.. 40 ఏళ్లు మాత్రమే బతుకుతాను
ఈ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ సోకిన వారు సరైన ఫుడ్‌,నిద్ర తప్పక పాటించాలని వైద్యులు సూచించినట్లు గీతూ రాయల్‌ చెప్పింది. పూర్తిగా డాక్టర్స్‌ చెప్పిన ప్రకారం లైఫ్‌ స్టైల్‌ మార్చుకోవాల్సి ఉందని ఆమె తెలిపింది.. వైద్యుల సూచనలు పాటించకుంటే మరింత అనారోగ్యానికి గురికావడం జరుగుతుందట.  ఈ క్రమంలో 40 ఏళ్లకు మించి బతకడం కష్టమని డాక్టర్స్‌ చెప్పినట్లు గీతూ పేర్కొంది. ఫైనల్‌గా తన అనారోగ్య పరిస్థితికి గల కారణాల గురించి ఒక వీడియో ద్వారా పూర్తి వివరాలు పంచుకుంది.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all
Advertisement