Bigg Boss 6 Telugu: Who Will Become New Captain Promo Out - Sakshi
Sakshi News home page

Bigg Boss 6 Telugu: కెప్టెన్‌ ఎవరో తెలిసిపోయిందిగా.. రాజ్‌ క్రష్‌ ఆమేనా?

Published Fri, Sep 23 2022 2:26 PM | Last Updated on Fri, Sep 23 2022 3:46 PM

Bigg Boss 6 Telugu: Who Will Become New Captain Promo Out - Sakshi

సూర్య-ఆరోహిల మధ్య గొడవ అలానే కంటిన్యూ అవుతుంది. రాజ్‌ తనతో ఇంకా మాట్లాడటం లేదని తలుచుకొని ఆరోహి ఏడుస్తుండగా, శ్రీహాన్‌ ఓదారుస్తాడు. ఆ తర్వాత రాజ్‌ లగేజ్‌ రూంకి వెళ్లడంతో తనను ఫాలో అవుతూ ఆరోహి కూడా వెళ్తుంది. అతనితో మాట్లాడే ప్రయత్నం చేస్తుంది. మరి వీళ్లిద్దరూ ఇప్పటికైనా మాట్లాడతారా? లేదా అన్నది చూడాల్సి ఉంది.

ఇక మరోవైపు నిన్నటి ఎపిసోడ్‌లో రాజ్‌కు ఈ హౌస్‌లో ఎవరో క్రష్‌ ఉందని గమనించిన హౌస్‌మేట్స్‌ ఆమె ఎవరన్నది ఎలా అయినా రాబట్టాలని తెగ ట్రై చేస్తున్నారు. ఇందులో భాగంగా గీతూ.. నీ క్రష్‌ నేను కదా, నాకు నువ్వు క్రష్‌ అంటూ సరదాగా రాజ్‌తో మాట్లాడుతుంది. దీంతో ఫైమా ఎంట్రీ ఇచ్చి మరి నేనేంటి అంటూ ఫన్నీగా అడుగుతుంది.

ఇక కెప్టెన్సీ టాస్క్‌లో చివరగా ఎత్తర జెండా అనే టాస్క్‌ని నిర్వహిస్తాడు బిగ్‌బాస్‌. ఇందులో కెప్టెన్సీ పోటీదారులు ఇసుకను ఎత్తి తమకిచ్చిన బాక్స్‌లో వేయాల్సి ఉంటుంది. మరి ఈ టాస్కులో విజేతగా నిలిచి కెప్టెన్‌గా ఎవరు నిలిచారన్నది ఆసక్తిగా మారింది. కానీ నెట్టింట అందుతున్న సమాచారం ప్రకారం ఆదిరెడ్డి కెప్టెన్‌ అయినట్లు సమాచారం. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement