Bigg Boss Geetu Royal Reveals Reasons Behind Her Elimination, Video Goes Viral - Sakshi
Sakshi News home page

Bigg Boss 6 Geetu: అభిజిత్‌, కౌశల్‌ కంటే నేనేం తక్కువ? వాళ్లు చేస్తే రైట్‌, నేను చేస్తా తప్పా?

Published Thu, Nov 10 2022 5:06 PM | Last Updated on Fri, Nov 11 2022 11:23 PM

Bigg Boss Geetu Reveals Reasons Behind Her Elimination Full Video - Sakshi

బిగ్‌బాస్‌ సీజన్‌-6లో ఎవరూ ఊహించని విధంగా ఎలిమినేట్‌ అయిన కంటెస్టెంట్‌ గీతూ రాయల్‌. టైటిల్‌ ఫేవరెట్‌గా మారిపోయిన గీతూ అనూహ్యంగా ఇంటినుంచి బయటకు వచ్చేసిన సంగతి తెలిసిందే. ఆమె ఎలిమినేషన్‌ ప్రేక్షకులనే కాదు,  హౌజ్‌మేట్స్‌ని కూడా షాకింగ్‌కి గురిచేసింది. ఇక గీతూ కూడా ఈ విషయాన్ని అస్సలు జీర్ణించుకోలేకపోయింది.

 హౌజ్‌ని వీడేముందు గీతూ ‘నన్ను పంపించొద్దు బిగ్‌బాస్‌’ అంటూ వేడుకున్న తీరు ప్రతిఒక్కరిని కదిలించింది. చివరికి అయిష్టాంగానే బిగ్‌బాస్‌ నుంచి బయటకు వచ్చింది. అయితే ఎలిమినేట్‌ అయ్య ఇన్నిరోజులు అవుతున్నా ఆమె ఇంతవరకు బయటకు రాలేదు. బిగ్‌బాస్‌ బజ్‌ ఇంటర్వ్యూ మినహా ఎవరికీ ఇంటర్వ్యూ ఇవ్వలేదు. తాజాగా గీతూ అఙ్ఞానం వీడింది. బిగ్‌బాస్‌లో తన జర్నీ దగ్గరి నుంచి ఏ పరిస్థితుల్లో బయటకు రావాల్సి వచ్చింది? బిగ్‌బాస్‌ ప్రయాణంలో తాను నేర్చుకున్న గుణపాఠం ఏంటి? వంటి పలు విషయాలపై గీతూ సుధీర్ఘంగా చర్చించింది. తాజాగా తన యూట్యూబ్‌ చానల్లో ఓ ఆస్తక్తికర వీడియోను షేర్‌ చేసింది.

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ‘బిగ్‌బాస్‌ హౌజ్‌లోకి వచ్చేముందు నన్ను ప్రమోట్‌ చేయమని కొందరికి రూ. 25 వేలు ఇచ్చాను. అయితే వారు ఏ పని చేయకుండా డబ్బులు తీసుకుని మోసం చేశారు. నా గురించి ఒక్కటంటే ఒక్క పాజిటివ్‌ కామంట్‌ చేయలేదు. ఇంక నేను నమ్మిన స్నేహితులు కూడా నన్ను మోసం చేశారు. వారందరూ నాకు సపోర్ట్‌ చేస్తారనే ధైర్యంతో హౌజ్‌లో అడుగుపెట్టాను. కానీ ఏ ఒక్కరి నుంచి కూడా నాకు మద్దతు రాలేదని బయటకు వచ్చాకా తెలిసింది. నిజంగా ఇది నన్ను తీవ్రంగా బాధించింది. నా గేమ్‌ను తప్పు పడుతున్నారు. అభిజిత్‌, కౌశల్‌ కంటే నేనేం తక్కువ? వాళ్లు చేస్తే రైట్‌, నేను చేస్తా తప్పా?’ అంటూ గీతూ వాపోయింది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement