
సినీ పరిశ్రమలో మరో విషాదం చోటుచేసుకుంది. ప్రముఖ మలయాళ నటి కోజికోడ్ శారద(84) గుండెపోటుతో కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆమెకు సోమవారం ఛాతిలో నొప్పి రావడంతో కుటుంబ సభ్యులు కేరళలోని కోజికోడ్ ప్రభుత్వ వైద్య కళాశాలకు తరలించారు. ఈ నేపథ్యంలో చికిత్స పోందుతున్న ఆమె ఆరోగ్యం విషమించడంతో మంగళవారం(నవంబర్ 9) ఉదయం తుదిశ్వాస విడిచారు. శారద మృతి పట్ల కేరళ ఫిల్మ్స్ అండ్ కల్చరల్ మంత్రి సాజి చెరియన్ సంతాపం తెలిపారు.
చదవండి: ఎట్టకేలకు ప్రెగ్నెన్సీ విషయంపై స్పందించిన కాజల్
అలాగే మలయాళ సినీ పరిశ్రమకు స్టార్ హీరో పృధ్వీరాజ్ సుకుమారన్, మోహన్ లాల్‌తో పాటు పలువురు నటీనటులు ఆమె మృతికి సోషల్ మీడియా వేదికగా నివాళులు అర్పిస్తున్నారు. కాగా ఈ రోజు సాయంత్రం ఆమె స్వస్థలమైన కోజికోడ్‌లో శారద అంత్యక్రియలు జరిగినట్లు తెలుస్తోంది. మలయాళ ప్రముఖ నటిగా పేరు తెచ్చుకున్న శారద, రంగస్థలంపై తన నటన జీవితాన్ని ప్రారంభించారు. 1979లో ‘అంగక్కురి’ చిత్రంతో ఆమె పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చారు. నాలుగు దశాబ్దాలుగా నటిగా రాణించిన ఆమె దాదాపు 90కి పైగా చిత్రాల్లో నటించారు. అలాగే పలు మలయాళ టీవీ సీరియల్స్‌లో కూడా శారద నటించారు.
Rest in peace 🙏 pic.twitter.com/aR4DyQLP5e
— Prithviraj Sukumaran (@PrithviOfficial) November 9, 2021