రాయ్‌లక్ష్మీ కౌగిలించుకోమంది | Raai Laxmi Said Dont Fear Hug me : Arjun | Sakshi
Sakshi News home page

రాయ్‌లక్ష్మీ కౌగిలించుకోమంది

Published Tue, Jul 3 2018 8:14 AM | Last Updated on Tue, Jul 3 2018 8:14 AM

Raai Laxmi Said Dont Fear Hug me : Arjun - Sakshi

తమిళసినిమా: నటి రాయ్‌లక్ష్మి భయపడకు గట్టిగా కౌగిలించుకో అని ధైర్యాన్నిచ్చిందని వర్ధమాన నటుడు అర్జున్‌ పేర్కొన్నాడు. ఎక్స్‌ వీడియోస్‌ చిత్రంలో నెగెటివ్‌ పాత్ర ద్వారా మంచి గుర్తింపు పొందిన నటుడీయన. ఈయన తొలి తమిళ చిత్రం పుళల్‌ అట. ఆ తరువాత ఆర్య, బాబీసింహా హీరోలుగా నటించిన బెంగుళూర్‌ డేస్‌ చిత్రంలో ముఖ్య పాత్రలో నటించాడు. అందులో నటి రాయ్‌ లక్ష్మి లవర్‌గా నటించాడు. చాలా మంది నటనపై మోహంతో సినిమా రంగంలోకి ప్రవేశిస్తుంటారు. అర్జున్‌ రంగప్రవేశమే వేరే మాదిరిగా జరిగిందట. ఆ సంగతులు ఆయన మాటల్లోనే. నాకు స్వతహాగా బిడియం ఎక్కువ. నా స్నేహితులు కెమెరా ముందు నిలబడి నటిస్తే బిడియం పోతుందని చెప్పి మోడలింగ్‌ రంగంలోకి పంపారు.

ఆ సమయంలోనే విష్ణు అనే మిత్రుడి ద్వారా పుగళ్‌ చిత్రంలో నటించడానికి డాన్స్, నటన తెలిసిన వారు కావాలన్న విషయం తెలిసి ప్రయత్నించగా అవకాశం వచ్చింది. తరువాత ఎంబీఏ పూర్తి చేసి అపోలో ఆస్పత్రిలో ట్రైనింగ్‌ కోసం రిసెప్షన్‌లో పనికి జాయిన్‌ అయ్యా. అలాంటి సమయంలో అక్కడ నటుడు సూర్య చిత్ర షూటింగ్‌ జరిగింది. అందులో నటించిన రమ్య అనే నటి ద్వారా బొమ్మరిల్లు భాస్కర్‌ దర్శకత్వంలో బెంగుళూర్‌ డేస్‌ చిత్రంలో నటించే అవకాశం లభించింది. అలా ఆ చిత్ర అసోసియేట్‌ సజో సుందర్‌తో స్నేహం ఎక్స్‌ స్టూడియోస్‌ చిత్రంలో నటించడానికి కారణమైంది. బెంగుళూర్‌ డేస్‌ చిత్రంలో బిడియ స్వభావం కలిగిన నాకు నటి రాయ్‌లక్ష్మీతో రొమాన్స్‌ చేసే సన్నివేశంలో నటించాల్సిన పరిస్థితి నెలకొంది. నేను సంశయించడంతో రాయ్‌లక్ష్మీనే భయపడకు గట్టిగా కౌగిలించుకో అని ధైర్యం చెప్పింది. అంత కంటే కష్టమైన విషయం ఆ చిత్రంలో బాబీసింహతో ఫైట్‌ సన్నివేశంలో నటించడం. అందుకు చాలా టేక్స్‌ తీసుకున్నా. ఆ చిత్రాల అనుభవమే ఎక్స్‌ వీడియోస్‌ చిత్రంలో కొత్త వాడిగానే తెలియలేదు అనే ప్రశంసలు అందించాయి. ఇకపై కూడా మంచి కథా పాత్రల్లో నటించాలని ఆశిస్తున్నాను అని అర్జున్‌ పేర్కొన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement