
నాగచైతన్యతో విడాకుల తర్వాత సమంత పేరు సోషల్ మీడియాలో ట్రెండింగ్‌గా నిలుస్తోంది. ఆమె ఏం మాట్లాడినా.. ఎలాంటి పోస్టులు పెట్టినా క్షణాల్లో వైరల్ అవుతున్నాయి. తాజాగా ఆమె విడాకులపై స్పందించిన విషయం తెలిసిందే. ఆ సమయంలో చాలా కుంగిపోయానని, ఒక దశలో చనిపోవాలనుకున్నాని చెప్పింది. తన వ్యక్తిగత జీవితంలో తగిలిన ఎదురుదెబ్బలతో 2021 సంవత్సరం ఎంతో కష్టంగా గడిచిందని తెలిపింది. ఈ నేపథ్యంలో తాజాగా ఓ ఆంగ్ల పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె విడాకుల అంశంపై మళ్లీ మళ్లీ మాట్లాడడం ఇష్టం లేదని చెప్పింది. తామిద్దరం విడిపోవడంపై చాలా మంది చాలా రకాలుగా అనుకుంటున్నారని, కానీ తన అభిప్రాయం ఏంటో ఇప్పటికే చెప్పేశానని పేర్కొంది. ఈ ఆంశంపై మళ్లీ మళ్లీ స్పందించాల్సిన అవసరం తనకు లేదని సామ్ చెప్పుకొచ్చింది.
కాగా, 2017లో ప్రేమవివాహంతో ఒక్కటైన సామ్-చై జంట.. ఈ ఏడాది అక్టోబర్ 2న విడిపోతున్నట్లు ప్రకటించారు. విడాకుల తర్వాత సామ్.. కెరీర్ పరంగా మరింత బిజీ అయింది. వరుస సినిమా అవకాశాలను దక్కించుకుంటూ టాలీవుడ్,బాలీవుడ్‌లో దూసుకెళ్తుంది. ఇప్పటికే ఆమె గుణశేఖర్ దర్శకత్వం వహించిన శాకుంతలం మూవీ షూటింగ్‌ని కంప్లిట్ చేసుకుంది. ప్రస్తుతం తమిళంలో విజయ్ సేతుపతితో ‘కాత్తు వాక్కుల రెండు కాదల్’ సినిమా నటిస్తోంది. దీంతో పాటు డ్రీమ్ వారియర్ పిక్చర్స్ నిర్మిస్తోన్న 30వ చిత్రానికి ఆమె సంతకం చేసింది. అలాగే ఓ హాలీవుడ్ చిత్రానికి కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. పుష్ప సినిమాలో స్పెషల్ సాంగ్‌తో అదరగొట్టేసింది.
Comments
Please login to add a commentAdd a comment