
టాలీవుడ్ క్యూట్ కపుల్ సమంత-నాగ చైతన్య విడాకులు తీసుకుంటున్నట్లు ప్రకటించి దాదాపు మూడు నెలలు కావోస్తున్నా.. సోషల్ మీడియాలో మాత్రం ఇప్పటికీ వారిద్దరి గురించి చర్చ నడుస్తూనే ఉంది. సోషల్ మీడియాలో సామ్ ఏ పోస్ట్ పెట్టినా సరే.. దాన్ని విడాకుల అంశానికి ముడిపెడుతూ వార్తలు పుట్టుకొస్తున్నాయి. చై-సామ్ విడిపోవడానికి ప్రధాన కారణాలు ఇవేనంటూ.. యూట్యూబ్‌లో పలు వీడియోలు దర్శనమిస్తున్నాయి. సమంత బోల్డ్ పాత్రలు చేయడం నాగార్జున, నాగచైతన్యలకు నచ్చలేదని, ఆమెకు షరత్తులు విధించడంతో విడిపోవాల్సి వచ్చిందని.. ఇలా ఎన్నో వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. తాజాగా ఈ వార్తలపై కింగ్ నాగార్జున స్పందించారు.
ఇటీవల ఆయన, నాగచైతన్యతో కలిసి ఓ జాతీయ మీడియాకు ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన చై-సామ్ విడాకుల సమయంలో వచ్చిన వార్తలపై స్పందిస్తూ... ‘కొంతమంది కావాలని అలాంటి చెత్త వార్తలు సృష్టిస్తున్నారు. నాపై అసత్య వార్తలు రాసినా.. పెద్దగా పట్టించుకోలేదు. కానీ, నా ఫ్యామిలీ గురించి నెగటివ్‌గా వార్తలు రాయడం మాత్రం చాలా బాధించింది’అన్నారు. ఇక నాగచైతన్య మాట్లాడూతూ.. అలాంటి చెత్త వార్తను పట్టించుకోనని చెప్పుకొచ్చారు. కాగా, 2017లో ప్రేమవివాహంతో ఒక్కటైన సామ్-చై జంట.. గతేడాది అక్టోబర్ 2న విడిపోతున్నట్లు ప్రకటించారు. విడాకుల తర్వాత ఇద్దరూ.. కెరీర్ పరంగా దూసుకెళ్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment