
Samantha Father Comments On ChaySam Divorce: తన కూతురి విడాకులపై సమంత తండ్రి జోసెఫ్ ప్రభు స్పందించారు. సమంత-నాగ చైతన్య విడాకుల విషయం తెలియగానే తన మైండ్ బ్లాక్ అయ్యందంటూ ఆయన భావోద్వేగానికి గురయ్యారు. చై-సామ్ విడాకుల విషయం వినగానే మొదట తనకు ఏం అర్థం కాలేదని, కళ్ల ముందు అంతా చీకటి కమ్ముకుందని ఆయన పేర్కొన్నారు. విడాకుల విషయంలో మరోసారి ఆలోచించి నిర్ణయం తీసుకోమని సమంతకు చెప్పినట్లు తెలిపారు. అయితే తన కూతురు స్పృహ ఉండే ఈ నిర్ణయం తీసుకుని ఉంటుందని, త్వరలోనే అన్ని పరిస్థితులు చక్కబడతాయని ఆశిస్తున్నానని సామ్ తండ్రి పేర్కొన్నారు. కాగా చై-సామ్ విడాకులు ప్రకటించిన అనంతరం అక్కినేని హీరో, చైతన్య తండ్రి నాగార్జున కూడా స్పందించిన సంగతి తెలిసిందే.
చదవండి: నాగ చైతన్య-సమంతలకు అభిమానుల విజ్ఞప్తి
చైతూ-సమంత విడిపోవడం దురదృష్టకరమంటూ భావోద్వేగానికి లోనయ్యారు. ఆయన ట్వీట్ చేస్తూ.. ‘ఎంతో బరువైన హృదయంతో ఈ విషయాన్ని చెప్పాల్సి వస్తోంది. చైతూ-సమంత విడిపోవటం దురదృష్టకరం. భార్యాభర్తల మధ్య ఏం జరిగినా అది వాళ్ల వ్యక్తిగతం. సమంత, నాగచైతన్య ఇద్దరూ నాకెంతో దగ్గరి వారు. సమంతతో నా కుటుంబం గడిపిన ప్రతి క్షణం ఎంతో మధురమైంది. ఆమె కుటుంబ సభ్యులు ఎల్లప్పుడు మాకు ఆత్మీయులే. దేవుడు వాళ్లిద్దరికీ మనో ధైర్యాన్ని ఇవ్వాలని ప్రార్థిస్తున్నా. వారికి నా ఆశీస్సులు ఎప్పుడూ ఉంటాయి’అని రాసుకొచ్చాడు. అంతేగాక సమంత ఫ్యామిలీ ఎల్లప్పుడూ తమకు ఆత్మీయులేనని, చైతు-సమంత ఎప్పటికీ తన గుండెల్లో ఉంటారని నాగార్జున పేర్కొన్నారు. కాగా తామిద్దరం విడిపోతున్నామని, ఎంతో ఆలోచించి ఈ నిర్ణయం తీసుకున్నామంటూ నాగ చైతన్య-సమంత శనివారం(అక్టోబర్ 2) సోషల్ మీడియా వేదికగా విడాకుల ప్రకటన చేసిన సంగతి తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment