Samantha Shocking Decision On Wedding Saree: Viral - Sakshi
Sakshi News home page

Samantha: పెళ్లి చీర విషయంలో సమంత షాకింగ్‌ నిర్ణయం!

Published Thu, Mar 10 2022 11:06 AM | Last Updated on Thu, Mar 10 2022 5:17 PM

Samantha Shocking Decision On Wedding Saree - Sakshi

Samantha Shocking Decision: టాలీవుడ్‌ క్యూట్‌ కపుల్‌ సమంత-నాగ చైతన్య విడాకులు ప్రకటించి 5 నెలలు గడిచింది. ఇప్పటికి వారి విడాకుల అంశం ఇండస్ట్రీలో హాట్‌టాపిక్‌గానే ఉంది. వారు మళ్లీ కలిస్తే బాగుండు అని ఇప్పటికీ వారి ఫ్యాన్స్‌ ఎదురు చూస్తున్నారు. ఇదిలా ఉంటే సమంత-చైతన్యలకు సంబంధించిన ఓ ఆసక్తికర విషయం ప్రస్తుతం నెట్టింట చర్చనీయాంశమైంది. కాగా ‘ఏం మాయ చేసావె’ సినిమాతో మొదలైన వీరి స్నేహం పెళ్లి దాకా వెళ్లింది.

చదవండి: ఆ యాక్షన్‌ సీన్‌లో ప్రభాస్‌ను విలన్‌ నిజమైన కర్రతో కొట్టాడట, ఆ తర్వాత..

ఇరు కుటుంబాలను ఒప్పించి మరి 2017, అక్టోబర్‌6న హిందూ, క్రిస్టియన్‌ పద్ధతిలో మూడుముళ్ల బంధంతో ఒక్కటయ్యారు. ఈ సందర్భంగా సమంత ధరించిన పెళ్లి చీరపై అప్పట్లో తెగ చర్చ జరిగింది. అంతేకాదు ఈ చీర నాగ చైతన్యకు సెంటిమెంట్‌ అనే విషయం తెలిసిందే. పెళ్లి మండపంలో సమంత కట్టుకున్న ఆ చీర చైతన్య అమ్మమ్మ, రామానాయుడు భార్య దగ్గుబాటి రాజేశ్వరిది. అమ్మమ్మ అంటే చైకి చాలా ఇష్టం. అందుకే ఆమె గుర్తుగా ఆ చీరను సమంత రీమోడలింగ్‌ చేయించి దాన్ని ధరించింది.

చదవండి: సమంతపై దారుణమైన ట్రోల్స్‌.. చీచీ ఇలా దిగజారిపోతున్నావేంటి?

ఇందుకోసం సుమారు రూ. 40 లక్షల వరకు ఖర్చయిందట. అయితే పెళ్లిలో అంతటి ప్రాధాన్యతను సంతరించుకున్న ఈపెళ్లి చీర విషయంలో సమంత షాకింగ్‌ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. విడాకుల అనంతరం చై, అక్కినేని కుటుంబానికి సంబంధించిన జ్ఞాపకాలను సామ్‌ వదిలించుకోవాలనుకుంటుందట. అందుకే ఈ పెళ్లి చీరను తిరిగి నాగ చైతన్యకు ఇచ్చేసిందంటూ వార్తలు వినిపిస్తున్నాయి. అయితే దీనిపై క్లారిటీ రావాల్సి ఉంది.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement