Samantha Share Interesting Instagram Post For Daughter Marriage - Sakshi
Sakshi News home page

Samantha: ‘మీ కూతురిని ఎవరు పెళ్లి చేసుకుంటారా అని కంగారు పడకండి’

Published Wed, Oct 27 2021 10:32 AM | Last Updated on Wed, Oct 27 2021 11:45 AM

Samantha Share Interesting Instagram Post For Daughter Marriage - Sakshi

నాగ చైతన్యతో విడాకుల అనంతరం సమంత సోషల్‌ మీడియాలో వరుసగా పోస్ట్స్‌ షేర్‌ చేస్తోంది. దీంతో ఆమె పోస్టులు సోషల్‌ మీడియా చర్చనీయాంశం అవుతున్నాయి. మై మామ్‌ సెడ్‌ అనే హ్యాష్‌ ట్యాగ్‌ ప్రస్తుతం తను ఎదుర్కొంటోన్న పరిస్థితులను గురించి వివరించే ప్రయత్నం చేస్తున్నారామె. ఈ క్రమంలో తన బెస్ట్‌ ఫ్రెండ్‌, మోడల్‌ శిల్పారెడ్డితో  ఇటీవల ఛార్ ధామ్ యాత్రకు వెళ్లోచ్చిన సంగతి తెలిసిందే. అక్కడ హిమాలయాల సమీపంలోని పవిత్ర దైవ క్షేత్రాలను దర్శించుకుని పూజలు నిర్వహించారు. ఇందుకు సంబంధించిన ఫోటోలో నెట్టింట్లో తెగ వైరల్ అయ్యాయి.

చదవండి: కూకట్‌పల్లి కోర్టులో సమంతకు ఊరట

ఇక యాత్ర ముగించుకని తిరిగి వచ్చిన సమంత తాజాగా పెయింటింగ్స్ వేస్తున్న ఫోటోలను, వీడియోలను షేర్ చేసుకున్నారు. వీటితో పాటు ఆమె మరో ఆసక్తికర పోస్ట్‌ను పంచుకున్నారు. ‘మీ కూతురిని ఎవరు పెళ్లి చేసుకుంటారాని కంగారు పడకుండా తనని సమర్థంగా తీర్చిదిద్దండి. తన పెళ్లి కోసం డబ్బు ఆదా చేసే బదులు తన చదువుకు ఖర్చు పెట్టండి. ఆమెను పెళ్లికి సిద్ధం చేసే ముందు తన కోసం తనని సిద్ధం చేయడం అంతకంటే ముఖ్యం. అలాగే తనని తాను ప్రేమించుకోవడం, ఆత్మవిశ్వాసంతో ఉండటం నేర్పించండి. అలాగే ఇతరులకు అవసరం ఉన్న సమయంలో తను మార్గదర్శకంగా ఉండేలా సిద్దం చేయండి’ అనే పోస్ట్‌ను షేర్‌ చేశారు.

చదవండి: ప్రత్యేక హెలికాప్టర్‌లో సమంత తీర్థయాత్రలు..ఫోటోలు వైరల్‌

కాగా ఇటీవల యుట్యూబ్‌ చానళ్లపై తను వేసిన పరువు నష్టం దావా కేసుపై నిన్న ఆమెకు కోర్టులో ఊరట లభించింది. ఆమె వ్యక్తిగత వివరాలను ప్రసారం చేయడానికి వీళ్లేదని, యూట్యూబ్‌ ఛానెల్స్‌ వెంటనే అలాంటి కంటెంట్‌ని తొలగించాలని ఆదేశించింది. ఆమె వ్యక్తిగత విషయాలపై సోషల్‌ మీడియాలో పెట్టిన కామెంట్స్‌ని కూడా తొలగించాలని కోర్టు పేర్కొంది. అలాగే సమంత కూడా తన వ్యక్తిగత విషయాలను సంబంధించిన పోస్టులను కూడా షేర్‌ చేయొద్దని స్పష్టం చేసింది. 

చదవండి: చార్‌ ధామ్‌ యాత్ర: ప్రత్యే​క పూజలు నిర్వహించిన సామ్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement