![Samantha Sharesh Sadguru Quotes Over Horrible Situation After Divorce - Sakshi](/styles/webp/s3/article_images/2022/03/2/samantha.jpg.webp?itok=qD8oK4Dv)
Samantha About Her Horrible Situation: స్టార్ హీరోయిన్ సమంత సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటుందన్న సంగతి తెలిసిందే. ఇక నాగచైతన్యతో విడాకుల అనంతరం సమంత షేర్ చేస్తున్న పోస్టులపై ఫోకస్ మరింత పెరిగింది. భర్తతో విడిపోయిన అనంతరం నుంచి తరచూ తన ఇన్‌స్టా గ్రామ్‌లో ఎమోషనల్, మోటివేషనల్ పోస్టులు దర్శనం ఇస్తున్నాయి. అంతేకాదు స్నేహితులతో కలిసి తీర్థయాత్రలు, పర్యాటనలకు వెళ్లిన పోస్టులను నిత్యం షేర్ చేస్తూనే ఉంటుంది సమంత. ఈ క్రమంలో విడాకులు అంశంపై ఆమె వీపరితమైన ట్రోల్స్ కూడా ఎదుర్కొంటోంది.
చదవండి: 9 ఏళ్ల వయసులోనే షాకిచ్చాడు: వర్మ సోదరి ఆసక్తికర వ్యాఖ్యలు
రీసెంట్‌గా హాలీవుడ్ హాస్యనటుడు విల్ స్మిత్ పుస్తకం నుంచి వైఫల్యం, నష్టం, అవమానం, విడాకులు వంటి వాటికి సంబంధించిన కోట్‌ను షేర్ చేసింది. ఇక తాజాగా సద్గురు కోట్‌ను షేర్ చేసింది సామ్. ఇందులో ‘మీరు జీవితంలో చాలా భయంకరమైన పరిస్థితులను ఎదుర్కొన్నప్పటికీ.. ఆ అనుభవాన్ని జీవితంలో ముందుకు వెళ్ళడానికి.. మంచి మనిషిగా జీవించడానికి ఉపయోగించుకోవచ్చు’ అని చెప్పిన మాటలున్నాయి. అలాగే ‘2022 నుండి తనకు జీవితంపై పెద్దగా అంచనాలు లేవు’ అంటూ తన విడాకుల విషయంపై ప్రస్తావించింది.
చదవండి: విడాకుల తర్వాత తొలిసారి కలుసుకున్న ధనుష్, ఐశ్వర్య.. ఏం జరిగిందంటే
అంతేగాక తాను తరచు ఎదుర్కొనే సోషల్ మీడియా ట్రోలింగ్ గురించి కూడా మాట్లాడింది. చైతో విడిపోయిన నేపథ్యంలో తాను అనుభవించిన మానసిక బాధను పంచుకుంది. ‘2021లో నా వ్యక్తిగత జీవితంలో జరిగిన సంఘటనతో నాకు ఎలాంటి అంచనాలు లేవు.. ఎందుకంటే నేను జాగ్రత్తగా రూపొందించిన ప్రణాళికలన్నీ శిథిలమయ్యాయి.. కాబట్టి నాకు ఎలాంటి అంచనాలు లేవు. భవిష్యత్తులో నా కోసం ఏదైతే భద్రంగా ఉంటుందో దానిని స్వీకరిస్తాను.. దానికోసం బెస్ట్ ఇవ్వడానికి ప్రయత్నిస్తాను’ అని సమంత పేర్కొంది.
Comments
Please login to add a commentAdd a comment