టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత విడాకుల అనంతరం తొలిసారిగా ఓ పోస్ట్ షేర్ చేశారు. అక్టోబర్ 8న జరిగే లాక్‌మీ(Lakme) ఫ్యాషన్ షో ప్రమోషన్‌లో భాగంగా సామ్ ఇన్‌స్టాగ్రామ్‌లో ఈ పోస్ట్ షేర్ చేసింది. అయితే ఇది ఫ్యాషన్ షోకు సంబంధించిన పోస్ట్ అయినప్పటీకి ఇందులో సమంత రాసుకొచ్చిన క్యాప్షన్‌లో మరేదో అర్థం ఉన్నట్లు కనిపిస్తోంది. కాగా ఈ రోజు సమంత-చైతన్య పెళ్లి రోజని తెలిసిందే. అంత బాగుంటే ఈ రోజు వారి 4వ వివాహవ వార్షికోత్సవం జరపుకునే వారు. ఈ సందర్భంగా సమంత వైట్ కలర్ డ్రెస్, వైట్ అండ్ పింక్ కలర్ గులాబి పూలు ధరించి కిందికి చూస్తున్న తన ఫొటోను షేర్ చేస్తూ ఇలా రాసుకొచ్చారు.
చదవండి: సమంత: ‘నేను నీ దాన్ని.. నీవు నా వాడివి’.. పోస్ట్ వైరల్
‘పాత ప్రేమ పాటలు - పర్వతాలు. శిఖరంపై శీతాకాలపు గాలి ధ్వని. కొన్ని పొగొట్టుకున్న పాత చిత్రాల పాటలు దొరికినప్పుడు. లోలోపలి బాధను ప్రతి ధ్వనించే ఆ ప్రేమ పాటలు. పాత బంగ్లాలు, మెట్ల మార్గాలు. సందులలో గాలి శబ్దం’ అంటూ సమంత భావోద్వేగానికి లోనయ్యారు. అయితే రేపు జరిగే ఫ్యాషన్ షో కోసం తను ఎదురు చూస్తున్నట్లు ఈ పోస్ట్ ద్వారా ఆమె పేర్కొన్నప్పటికీ ఇందులో మరెదో లోతైన అర్థం వచ్చేలా ఉన్న తన నోట్ చూసి నెటిజన్లు, అభిమానులు తమదైన శైలిలో స్పందిస్తున్నారు.
చదవండి: విడాకుల ఎఫెక్ట్: షూటింగ్‌లో కన్నీళ్లు పెట్టుకున్న సమంత
సామ్ విడాకుల విషయంలో చాలా నిరాశగా ఉన్నారని, ప్రస్తుతం తను గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటున్నారంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. కాగా అక్టోబర్ 2న తన భర్త, టాలీవుడ్ హీరో నాగ చైతన్యతో విడిపోతున్నట్లు సమంత ఇన్‌స్టాలో అధికారిక ప్రకటన చేసిన సంగతి తెలిసిందే. అప్పటి నుంచి చై-సామ్ విడాకులు సినీ ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారింది. ఈ క్రమంలో నిన్న తన మూవీ షూటింగ్‌లో పాల్గొన్న సమంత తన విడాకులు విషయంపై భావోద్యేగానికి లోనైనట్లు సినీ వర్గాల నుంచి సమాచారం.
Comments
Please login to add a commentAdd a comment