
Did Samantha Decided To Stay In Her Old Home: సమంత-నాగ చైతన్య విడాకులు తీసుకున్నట్లు ప్రకటించి దాదాపు నెల రోజులు గడుస్తున్నా ఇప్పటికీ వారికి సంబంధించి ఏదో ఒక వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూనే ఉంది. మరోవైపు సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్‌గా ఉండే సమంత విడాకుల తర్వాత కూడా అదే కంటిన్యూ చేస్తుంది. తాజాగా సమంత తన రెండు కుక్క పిల్లలకు సంబంధించి 'మార్నింగ్ మ్యాడ్‌నెస్' అంటూ ఇన్‌స్టాలో పోస్టు షేర్ చేసింది.చదవండి: Samantha: 'నేను మనిషిని..నిర్ణయించుకున్నా..ప్రేమిస్తున్నాను'..
రీసెంట్‌గా కూడా సమంత 'న్యూ బ్రింగింగ్ బ్యాక్' అంటూ తన ఇంటికి సంబంధించి కొన్ని మూమెంట్స్‌ను పంచుకుంది. ఈ ఫోటోను బట్టి చూస్తే.. సమంత ఇంతకుముందు నాగ చైతన్యతో కలిసి ఉన్న ఇంట్లోనే ఉంటుందని తెలుస్తుంది. ఇప్పుడు కూడా అక్కడే ఉండాలని సామ్ నిర్ణయించుకుందట. మరోవైపు నాగ చైతన్య.. గతేడాదే జూబ్లిహిల్స్‌లోని ఓ విలాసవంతమైన ఇళ్లు కొనుగోలు చేశాడు. ప్రస్తుతం దాని రెనోవేషన్ పనులు జరుగుతున్నాయట. అప్పటివరకు చై అక్కడే ఓ అపార్ట్‌మెంట్‌లో ఒంటరిగా ఉంటున్నట్లు సమాచారం.
చదవండి: షారుక్ ఖాన్ బర్త్‌డే.. వెలిగిపోతున్న 'మన్నత్'
అప్పుడే మనిషి నిజస్వరూపం బయటపడుతుంది: సమంత
Comments
Please login to add a commentAdd a comment