Naga Chaitanya OTT Debut With Villain Role In Amazon Web Series - Sakshi
Sakshi News home page

Naga Chaitanya: సమంతను ఫాలో అవుతున్న నాగ చైతన్య!

Published Sun, Nov 7 2021 1:47 PM | Last Updated on Sun, Nov 7 2021 2:53 PM

Naga Chaitanya To Debut On OTT With Amazon Web Series - Sakshi

Naga Chaitanya: సమంత-నాగ చైతన్య విడాకులు తీసుకుంటున్నట్లు ప్రకటించి దాదాపు నెల కావొస్తున్నా ఇప్పటికీ వీరికి సంబంధించి ఏదో ఒక వార్త సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతూనే ఉంది. విడా​కుల అనంతరం బాగా కుంగిపోయిన సామ్‌..ఆ బాధలోంచి బయటపడేందుకు ఎక్కువగా స్నేహితులతో కలిసి వెకేషన్‌కు వెళ్తున్నట్లు ఆమె సన్నిహితులు తెలిపారు. చదవండి:  చైతూతో కలిసి ఉన్న ఇంట్లోనే ఉండాలని సమంత నిర్ణయం!

అంతేకాకుండా అటు సినిమాల పరంగానే బాగా బిజీ అవ్వాలని చూస్తున్న సమంత..విడాకుల అనంతరం బ్యాక్‌ టూ బ్యాక్‌ సినిమాలు ప్రకటించింది. మరోవైపు ఇటీవలె లవ్‌స్టోరీ సినిమాతో హిట్టు కొట్టిన నాగ చైతన్య కూడా వరుస ప్రాజెక్టులతో బిజీ అవుతున్నాడు. ప్రస్తుతం బంగార్రాజు సినిమా చేస్తున్న చై ఇప్పుడు ఓటీటీలో సైతం ఇంట్రీ ఇస్తున్నాడు. అమెజాన్‌ ప్రైమ్‌లో ఈ వెబ్‌సిరీస్‌ స్ట్రీమింగ్ కానుంది. 

హర్రర్‌ కథాంశంతో తెరకెక్కుతున్న ఈ వెబ్‌సిరీస్‌లో చైతూ విలన్‌ రోల్‌ చేయనున్నాడట. విక్రమ్‌కుమార్‌ డైరెక్ట్‌ చేయనున్న ఈ సిరీస్ షూటింగ్‌ త్వరలోనే ప్రారంభం కానుంది.ఇప్పటికే సమంత ‘ఫ్యామిలీ మ్యాన్ 2’తో డిజిటల్‌ ఎంట్రీ ఇచ్చి సూపర్‌హిట్‌ కొట్టిన సంగతి తెలిసిందే. ఇప్పుడు చై సైతం అదే బాటలో వెళ్తున్నట్లు తెలుస్తుంది. 

చదవండి:అప్పుడే మనిషి నిజస్వరూపం బయటపడుతుంది: సమంత
రెమ్యునరేషన్‌ భారీగా పెంచిన సమంత.. ఒక్కో సినిమాకు ఎంతంటే..

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

Photos

View all

Video

View all
 
Advertisement