Naga Chaitanya Shocking Comments On His Movie Roles Video Goes Viral - Sakshi
Sakshi News home page

Naga Chaitanya: చై కామెంట్స్‌ సమంతను ఉద్దేశించేనా?..వీడియో వైరల్‌

Published Tue, Dec 14 2021 1:26 PM | Last Updated on Tue, Dec 14 2021 2:06 PM

Naga Chaitanya Shocking Comments On His Movie Roles Video Goes Viral - Sakshi

Naga Chaitanya Shocking Comments On His Movie Roles Goes Viral: సమంత-నాగచైతన్య విడాకుల వ్యవహారం ఇప్పటికీ హాట్‌ టాపిక్‌గానే ఉంది. వీరు విడిపోయి దాదాపు రెండు నెలలు కావొస్తున్నా ఈ జంట విడిపోవడాన్ని అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. ఇక ఇప్పటికే విడాకుల గురించి సమంత తన అభిప్రాయాన్ని చెప్పగా, నాగ చైతన్య మాత్రం ఇంతవరకు స్పందించలేదు. సాధారణంగానే సోషల్‌ మీడియాకు దూరంగా ఉండే చై.. ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ చక్కర్లు కొడుతుంది.

ఇందులో ఎలాంటి పాత్రలు చేయడానికి ఇష్టపడరు అనే ప్రశ్నకు నాగ చైతన్య మాట్లాడుతూ.. 'అన్ని రకాల పాత్రలు చేయడానికి నేను ఎప్పుడూ సిద్ధమే. కానీ నేను పోషించే పాత్ర, సినిమా మా కుటుంబంపై ఎఫెక్ట్‌ చూపించకూడదు. మా ఫ్యామిలీని ఇబ్బంది పెట్టే విధంగా ఉంటే ఎట్టి పరిస్థితుల్లో చేయను' అంటూ చై పేర్కొన్నారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

సమంతను ఉద్దేశించే పరోక్షంగా చై ఈ వ్యాఖ్యలు చేశారంటూ పలువురు నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. దీంతో ఫ్యామిలీ మెన్‌-2 వెబ్‌ సిరీస్‌లో సమంత బోల్డ్‌ యాక్టింగ్‌ వీరి విడాకులకు ప్రధాన కారణమనే రూమర్స్‌కి చై వ్యాఖ్యలతో మరింత బలం చేకూరిందనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఇక విడాకుల అనంతరం సమంత వరుస సినిమాలతో దూసుకెళ్తుంది. ప్రస్తుతం నాగ చైతన్య థ్యాంక్యూ, బంగార్రాజు చిత్రాల్లో నటిస్తున్న సంగతి తెలిసిందే. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement