
ChaySam Divorce: ఇప్పుడు ఎక్కడ చూసినా టాలీవుడ్ మోస్ట్ బ్యూటిఫుల్ కపుల్ సమంత- నాగచైతన్య విడాకుల వ్యవహారమే నడుస్తోంది. చూడచక్కనైన ఈ జంట విడిపోవడాన్ని ఇప్పటికీ జీర్ణించుకోలేకపోతున్నారు అభిమానులు. అసలు వీరిద్దరూ విడాకులు తీసుకోవడానికి బలమైన కారణాలు ఏమై ఉంటాయా? అని పలువురు ఆరా తీస్తున్నారు. ఈ క్రమంలో సమంత స్టైలిస్ట్ ప్రీతమ్ జుకాల్కర్ కూడా ఓ కారణమే అంటూ పలువురూ అతడిని నిందిస్తున్నారు.
సోషల్ మీడియాలో సమంతతో ఉన్న పాత ఫొటోలను షేర్ చేస్తూ అంతా నువ్వే చేశావంటూ ప్రీతమ్‌ను దుమ్మెత్తిపోస్తున్నారు. ఈ క్రమంలో తన మీద దాడి చేస్తున్న కొందరికి ఘాటుగా బదులిచ్చినప్పటికీ ప్రీతమ్ మీద ట్రోలింగ్ ఆగడం లేదు. దీంతో వారి బాధ తట్టుకోలేకపోయిన ప్రీతమ్ తనను వేధిస్తున్న పలు అకౌంట్ల వివరాలను ఇన్‌స్టాగ్రామ్ స్టోరీస్‌లో పంచుకున్నాడు. వీరి వల్ల మెంటల్ టార్చర్ అనుభవిస్తున్నానని వాపోయాడు. తనను వేధిస్తున్న ఈ అకౌంట్లను రిపోర్టు చేయండని అభిమానులను కోరాడు. ఈ విషయంలో తనకు సహాయం చేయాలని కోరుతూ సైబరాబాద్ పోలీసులను ట్యాగ్ చేశాడు.
Comments
Please login to add a commentAdd a comment