
కాఫీ వీత్ కరణ్ జోహార్ షోలో తాజాగా స్టార్ హీరోయిన్ సమంత సందడి చేసిన సంగతి తెలిసిందే. దీంతో ఈ ఎపీసోడ్ ప్రత్యేకతను సంతరించుకుంది. ఎందుకంటే సమంత-నాగ చైతన్య విడాకులపై నెలకొన్న ఎన్నో సందేహాలు ఈ ఎపోసొడ్‌తో తీరుతాయని సౌత్ ప్రేక్షకులంత ఎంతో ఆసక్తిగా ఎదురుచూశారు. ఎట్టకేలకు సమంత ఎపిసోడ్ గత రాత్రి డిస్నీప్లస్ హాట్‌స్టార్‌లో విడుదలైంది. అందరు అనుకున్నట్లుగానే ఈ షోలో సామ్‌కు విడాకులు, ట్రోల్స్, భరణంపై ప్రశ్నలు ఎదురయ్యాయి.
చదవండి: Koffee With Karan: నాగ చైతన్యతో విడాకులు, భరణంపై సమంత ఆసక్తికర వ్యాఖ్యలు
మొదట్లో బాధఫడ్డా.. ప్రస్తుతం దాని నుంచి పూర్తిగా బయటపడ్డానని తెలిపింది. అంతేకాదు మునపటి కంటే ఇప్పుడు మరింత స్ట్రాంగ్ అయ్యానని పేర్కొంది. అలాగే ఈ షో మరో ఆసక్తికర సంఘటన చోటు చేసుకుంది. సామ్ చై గురించి అడిగే క్రమంలో కరణ్ జోహార్ మీ భర్త అంటూ వ్యాఖ్యానించాడు. దీంతో వెంటనే మధ్యలో సమంత కల్పించుకుని ‘మాజీ భర్త’ అనాలి అంటూ కరెక్ట్ చేసింది. వెంటనే కరణ్ సారీ చెబుతూ.. మీ మాజీ భర్త, మీరు విడిపోయినప్పుడు మీరే కారణమంటూ ఎక్కువగా ట్రోలింగ్ జరిగిందని భావించారా? అని అడగ్గా..
చదవండి: కాఫీ విత్ కరణ్: టాలీవుడ్ నెపోటిజంపై సమంత ఇంట్రెస్టింగ్ కామెంట్స్
‘అవును, కానీ ప్రస్తుతం నేను దాని గురించి ఎలాంటి ఫిర్యాదు చేయలేను. ఎందుకంటే నేను ప్రశాంతంగా ఉండటానికి ఆ మార్గాన్ని ఎంచుకున్నాను. ఒకవేళ స్పందించాలన్నా ఆ సమయంలో నా దగ్గర సమాధానాలు లేవు’ అని చెప్పుకొచ్చింది. అనంతరం నాగ చైతన్యకు మీకు మధ్య ఏవైన మనస్పర్థలు ఉన్నాయా అని అడగ్గా.. ‘మా ఇద్దరినీ ఒకే గదిలో ఉంచితే మీరు పదునైన వస్తువులు దాచాల్సి ఉంటుంది’ అంటూ ఆసక్తికర సమాధానం ఇచ్చింది.
Comments
Please login to add a commentAdd a comment