ChaySam Divorce: Samantha Stays In Hyderabad At Gachibowli Flat After Divorce - Sakshi
Sakshi News home page

Samantha: ఇకపై సమంత ఉండేది అక్కడేనట.. త్వరలోనే ఆ ఫ్లాట్‌కు మకాం!

Published Wed, Oct 6 2021 8:02 AM | Last Updated on Wed, Oct 6 2021 4:30 PM

ChaySam Divorce: Samantha Stays In Hyderabad At Gachibowli Flat After Divorce - Sakshi

టాలీవుడ్‌ క్యూట్‌ కపుల్‌ అక్కినేని నాగ చైతన్య- స్టార్ హీరోయిన్ సమంతలు తమ నాలుగేళ్ల వివాహ బంధానికి స్వస్తి పలికిన సంగతి తెలిసిందే. మేము విడిపోతున్నామంటూ అక్టోబర్‌ 2న ఈ జంట అధికారికంగా ప్రకటించారు. అప్పటి నుంచి వీరి విడాకులు వ్యవహరం పరిశ్రమలో హాట్‌ టాపిక్‌గా మారింది. ఇక సోషల్‌ మీడియాలో వారు పెడుతున్న పోస్టులు వైరల్‌ అవుతున్నాయి. ఇదిలా ఉంటే గత కొద్ది రోజులుగా సామ్‌ ముంబైలో ఇల్లు కొనిందని, త్వరలోనే అక్కడికి మకాం మార్చనున్నట్లు వార్తలు వినిపించిన సంగతి తెలిసిందే. అయితే ఈ వార్తలను కొట్టిపారెస్తూ తాను హైదరాబాద్‌లోనే ఉంటున్నట్లు ఇటీవల సామ్‌ సోషల్‌ మీడియా లైవ్‌ సెషన్‌లో స్పష్టం చేసింది.

చదవండి: సమంత కట్టుకున్న పెళ్లి చీర ఎవరిదో తెలుసా?

దీంతో ఆమె అభిమానులు కాస్తా ఊపిరి పిల్చుకున్నారు. ఈ లోగా వారి విడాకులు ప్రకటన మరోసారి ఫ్యాన్స్‌ను బాధించింది. దీంతో సమంత ఇక ముంబైకి వెళ్లడం ఖాయమని అందరూ చర్చించుకుంటున్నారు. ఈ క్రమంలో సామ్‌ అభిమానులకు ఊరటనిచ్చే ఓ వార్త సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఇకపై కూడా సామ్‌ హైదరాబాద్‌లోనే ఉండబోతుందట.

గచ్చిబౌలిలోని ఓ ప్లాట్‌కు సమంత షిఫ్ట్‌ కానుందని, ఇకపై అక్కడే ఒంటరిగా నివసించనుందని సన్నిహిత వర్గాల నుంచి సమాచారం. అయితే గతంలో సామ్‌ హైదరాబాద్ తనకు ఎన్నో ఇచ్చిందని, ఇదే తన హోమ్ టౌన్‌.. ఇప్పటికీ, ఎప్పటికీ అని చెప్పింది. కాగా సమంత ఇటీవల ‘శాకుంతలం’ మూవీ షూటింగ్‌ను పూర్తి చేసుకోగా.. ‘కాతువాకుల రెండు కాదల్‌’ అనే చిత్రంలో నటిస్తోంది. ఈ మూవీ షూటింగ్‌లో భాగంగా ప్రస్తుతం సామ్‌ చెన్నైలో ఉంటున్న విషయం తెలిసిందే. 

చదవండి: 
విడాకులపై స్పందించిన సమంత తండ్రి
చై-సామ్‌ విడిపోవడానికి గల కారణాన్ని ప్రీతమ్‌ ఇలా బయట పెట్టాడా?
సమంత స్టైలిస్ట్‌ ప్రీతమ్‌కు తప్పని మానసిక వేధింపులు!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement