Bollywood Evergreen Movies To watch This Diwali Festival - Sakshi
Sakshi News home page

Bollywood Movies: కుటుంబ సమేతంగా చూడాల్సిన అత్యుత్తమ టాప్ బాలీవుడ్ చిత్రాలివే..!

Published Fri, Oct 21 2022 4:06 PM | Last Updated on Fri, Oct 21 2022 7:19 PM

Bollywood Evergreen Movies Tio watch This Diwali Festival List - Sakshi

దీపావళికి మీరు ఏ సినిమాకు వెళ్లాలనుకుంటున్నారు? మీ కుటుంబంతో ఈ దివాళీని ఎలా ఎంజాయ్ చేయాలనుకుంటున్నారు? మీకు ఏ సినిమాకెళ్తే బాగుంటుందని ఆలోచిస్తున్నారా? సినిమా ఎంపిక కోసం తర్జనభర్జనకు గురవుతున్నారా? అలాంటి ఆలోచనలకు ఇక చెక్‌ పెట్టండి. మీకోసం ఈ దీపావళికి చూడాల్సిన 34 ఉత్తమ బాలీవుడ్ సినిమాల పేర్లను అందిస్తున్నాం. అందులో మీకు నచ్చిన మూవీకి కుటుంబసమేతంగా వెళ్లి ఈ పండుగను ఆనందంగా ఆస్వాదించండి. బాలీవుడ్‌లో ఎవర్‌గ్రీన్ సినిమాలేంటో ఒక్కసారి పరిశీలిద్దాం. ఈ జాబితాలో కామెడీ, ఫ్యామిలీ, డ్రామా లాంటి అన్ని చిత్రాలను అందిస్తున్నాం. మరేందుకు ఆలస్యం మీరు ఓ లుక్కేయండి. 
 
 అత్యుత్తమ బాలీవుడ్ సినిమాల జాబితా: 


1.కభీ ఖుషీ కభీ ఘమ్ (2001)

నటీనటులు: షారుఖ్ ఖాన్, అమితాబ్ బచ్చన్, హృతిక్ రోషన్, జయా బచ్చన్, కాజోల్ లాంటి అగ్రతారలు నటించిన ఈ చిత్రం నెట్‌ఫ్లిక్స్‌లో అందుబాటులో ఉంది. కుటుంబసమేతంగా చూడాల్సిన సినిమా ఇది. 

2. త్రీ ఇడియట్స్ (2009)

శర్మన్ జోషి, అమీర్ ఖాన్, బోమన్ ఇరానీ, ఆర్.మాధవన్, కరీనా కపూర్, ఓమి వైద్య, మోనా సింగ్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా ఓటీటీ ఫ్లామ్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ  చిత్రంలో ఓ కళాశాల విద్యార్థి పోరాటాలు, జీవితంలో సరైన వృత్తిని ఎంచుకోవడానికి  ప్రయత్నాలను చక్కగా చిత్రీకరించారు.

3. భేజా ఫ్రై (2007)

 సారిక, వినయ్ పాఠక్, మిలింద్ సోమన్, రజత్ కపూర్, రణవీర్ షోరే నటించిన ఈ చిత్రం ఫుల్ కామెడీ ఎంటర్‌టైనర్. ఈ దీపావళికి మీరు మీ కుటుంబంతో కలిసి హాయిగా నవ్వుకోవాలనుకుంటే ఈ సినిమా చూసేయండి. ఈ చిత్రానికి సాగర్ బళ్లారి దర్శకత్వం వహించారు. 

4. మొహబ్బతీన్ (2000)
షారుఖ్ ఖాన్, అమితాబ్ బచ్చన్, ఐశ్వర్య రాయ్, ఉదయ్ చోప్రా నటించిన ఈ మూవీ బాలీవుడ్‌లో ఆల్ టైమ్ ఫ్యామిలీ మూవీస్‌లో ఒకటి. ఈ చిత్రం ఆమెజాన్ ప్రైమ్ వీడియోలో చూసి ఎంజాయ్ చేయండి. ఈ సినిమాకు ఆదిత్య చోప్రా దర్శకత్వం వహించారు. ముగ్గుర విద్యార్థుల ప్రేమకథ ఆధారంగా ఈ చిత్రం తెరకెకించారు.

5. పా (2009)
పా మూవీ ఉత్తమ కుటుంబ చిత్రాలలో ఒకటి. విద్యాబాలన్, అమితాబ్ బచ్చన్, అరుంధతి నాగ్, అభిషేక్ బచ్చన్, పరేష్ రావల్ లాంటి అగ్రతారలు ఈ సినిమాలో నటించారు. కుటుంబసమేతంగా చూడాల్సిన చిత్రాల్లో ఇది ఒకటి. ఈ సినిమాకు ఆర్.బాల్కీ దర్శకత్వం వహించారు. 

6.హమ్ ఆప్కే హై కౌన్..! (1994)
 1994 లో వచ్చిన క్లాసిక్ మూవీ నదియా కే పార్ (1982)కి రీమేక్ ఈ చిత్రం. దేశంలో 1 బిలియన్ డాలర్లకు పైగా వసూలు చేసిన మొదటి సినిమా ఇదే. ఇది అత్యంత భారీ బ్లాక్‌బస్టర్‌ చిత్రాల్లో ఒకటి. కుటుంబ సమేతంగా చూడాల్సిన సినిమా. అలోక్ నాథ్, మాధురీ దీక్షిత్, మోహ్నీష్ బహ్ల్, రేణుకా షహానే, సల్మాన్ ఖాన్, అనుపమ్ ఖేర్, రీమా లాగూ, దిలీప్ జోషి, సతీష్ షా ప్రధాన పాత్రల్లో నటించారు. సూరజ్ బర్జాత్యా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ప్రస్తుతం నెట్‌ఫ్లిక్స్‌లో ఈ మూవీ అందుబాటులో ఉంది. 

7. చుప్కే చుప్కే (1975)

 1970ల్లో వచ్చిన బాలీవుడ్ చిత్రాల్లో కచ్చితంగా చూడాల్సిన సినిమా. లవ్ అండ్ కామెడీ ఎంటర్‌టైనర్‌గా వచ్చిన ఈ చిత్రం  మిమ్మల్ని బాగా నవ్విస్తుంది. షర్మిలా ఠాగూర్, ధర్మేంద్ర, అస్రానీ, అమితాబ్ బచ్చన్, జయా బచ్చన్, ఉషా కిరణ్, ఓం ప్రకాష్, డేవిడ్ అబ్రహం చెల్కర్, లిల్లీ చక్రవర్తి ఈ సినిమాలో నటించారు. హృషికేష్ ముఖర్జీ తెరకెక్కించిన ఈ మూవీ అమెజాన్ ప్రైమ్ వీడియోలో అందుబాటులో ఉంది. 

8. రంగీలా (1995)
ప్రముఖ బాలీవుడ్ నటి కావాలని కలలు కనే అమ్మాయి నేపథ్యంలో తెరకెక్కింది ఈ చిత్రం. ఈ సినిమా మ్యూజిక్ ట్రాక్ చాలా బాగుంటుంది. ఎ.ఆర్. రెహమాన్ ఒరిజినల్ స్కోర్‌తో పాటు సౌండ్‌ట్రాక్‌తో వచ్చిన తొలి హిందీ సినిమా. అమీర్ ఖాన్, ఊర్మిళ మటోండ్కర్, జాకీ ష్రాఫ్ ప్రధాన పాత్రల్లో నటించగా.. రామ్ గోపాల్ వర్మ దర్శకత్వం వహించారు. 

9. ఖయామత్ సే ఖయామత్ తక్ (1988)

అమీర్ ఖాన్, జూహీ చావ్లా, దలీప్ తాహిల్, అలోక్ నాథ్ నటించిన ఆల్ టైమ్ అత్యుత్తమ బాలీవుడ్ రొమాంటిక్ చిత్రాల్లో ఇదీ ఒకటి. ఈ సినిమాకు ఆనంద్-మిలింద్ స్వరాలు సమకూర్చారు. 1980ల్లో అత్యధికంగా అమ్ముడైన బాలీవుడ్ సౌండ్‌ట్రాక్ ఆల్బమ్‌లలో ఒకటిగా నిలిచింది ఈ చిత్రం. మన్సూర్ ఖాన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం జీ5లో స్ట్రీమింగ్ అవుతోంది. 

10. ఆనంద్ (1971)

1971లో విడుదలైన ఈ చిత్రంలో క్యాన్సర్‌తో  బాధపడుతున్న ఓ వ్యక్తి జీవితం ఆధారంగా తెరకెక్కించారు. ఇప్పటివరకు తీసిన ఉత్తమ బాలీవుడ్ కుటుంబ చిత్రాలలో ఒకటి. అమితాబ్ బచ్చన్, రమేష్ డియో, రాజేష్ ఖన్నా, సుమితా సన్యాల్ నటించిన ఈ సినిమాకు హృషికేష్ ముఖర్జీ దర్శకత్వం వహించారు. 

11. మైన్ మేరీ పత్నీ... ఔర్ వో! (2005)

 మైన్ మేరీ పత్నీ...ఔర్ వో! చిత్రంలో ఓ మధురమైన ప్రేమకథను చూపించారు. వైవాహిక జీవితంలో ఎదురయ్యే సమస్యలను చక్కగా తెరకెక్కించారు. 
 ప్రతి సీన్‌లో భావోద్వేగాలు ఆకట్టుకుంటాయి. ఈ పండుగ సీజన్‌లో కచ్చితంగా చూడాల్సిన సినిమాల్లో ఒకటి. వరుణ్ బడోలా, రాజ్‌పాల్ యాదవ్, రితుపర్ణ సేన్‌గుప్తా, కే కే మీనన్ నటించిన ఈ చిత్రానికి చందన్ అరోరా దర్శకత్వం వహించారు. 

12. రాకెట్ సింగ్: సేల్స్‌మ్యాన్ ఆఫ్ ది ఇయర్ (2009)
మీకు కామెడీ, డ్రామా కావాలనుకుంటే రాకెట్ సింగ్: సేల్స్‌మ్యాన్ ఆఫ్ ది ఇయర్ చూడాల్సిందే. రణ్‌బీర్ కపూర్, ప్రేమ్ చోప్రా, గౌహర్ ఖాన్, మనీష్ చౌదరి, షాజాన్ పదమ్సీ, డి.సంతోష్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రానికి షిమిత్ అమీన్ దర్శకత్వం వహించారు.

13. చలో ఢిల్లీ (2011)

ప్రముఖ ఇన్వెస్టర్ ఢిల్లీ ఫ్లైట్ మిస్ కావడంతో ఆమె జీవితం ఎలా మారిపోయిందో ఈ చిత్రంలో చూపించారు. ఇది ఉత్తమ బాలీవుడ్ కుటుంబ కథాచిత్రాల్లో ఒకటిగా నిలిచింది. అక్షయ్ కుమార్, లారా దత్తా, మహికా శర్మ, వినయ్ పాఠక్ ప్రధాన పాత్రల్లో నటించారు. 


14. దిల్ తో పాగల్ హై (1997)
షారుఖ్ ఖాన్, కరిష్మా కపూర్, మాధురి దీక్షిత్ నటించిన ఈ చిత్రం అలనాటి బాలీవుడ్ ఉత్తమ కుటుంబ చిత్రాల్లో ఒకటి. ట్రై యాంగిల్ లవ్‌స్టోరీని ఈ సినిమాలో చూడొచ్చు. షారుఖ్ ఖాన్, కరిష్మా కపూర్, మాధురీ దీక్షిత్, అక్షయ్ కుమార్ నటించిన ఈ చిత్రాన్ని యష్ చోప్రా తెరకెక్కించారు.

15. తేరే బిన్ లాడెన్ (2010)
 ఉత్తమ వ్యంగ్య హాస్య చిత్రాల్లో ఇది ఒకటి. అమెరికాకు వెళ్లాలనుకున్న ఓ రిపోర్టర్ కథే తేరే బిన్ లాడెన్. ఈ సినిమా కుటుంబ సభ్యులతో కలిసి చూడొచ్చు. సుగంధ గార్గ్, ప్రధుమాన్ సింగ్, అలీ జాఫర్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రానికి అభిషేక్ శర్మ దర్శకత్వం వహించారు. 

16. బంటీ ఔర్ బబ్లీ (2005)
 ఇద్దరు వ్యక్తులు వారి కలను సాకారం చేసుకోవడానికి చాలా కష్టాలను ఎదుర్కొంటారు. దానికోసం వారు ఏ మార్గాన్ని ఎంచుకున్నారో చక్కగా చూపించారు. కామెడీ జోనర్‌లోని ఉత్తమ బాలీవుడ్ ఫ్యామిలీ సినిమాల్లో ఇది ఒకటి. అమితాబ్ బచ్చన్, రాణి ముఖర్జీ, అభిషేక్ బచ్చన్ నటించిన మూవీని షాద్ అలీ తెరకెక్కించారు. 


17. దృశ్యం (2015)

ఈ చిత్రం ఆద్యంతం చాలా ఆసక్తిని రేకెత్తిస్తుంది. సస్పెన్స్, ట్విస్ట్‌లతో కథను చక్కగా తెరకెక్కించారు.  ఒక నేరం నుంచి తన కుటుంబాన్ని రక్షించుకోవడానికి అతను  తీసుకునే నిర్ణయాల ఆధారంగా కథాంశమే ఈ చిత్రం. శ్రియా శరణ్, మృణాల్ జాదవ్, అజయ్ దేవగన్, రజత్ కపూర్, టబు, ఇషితా దత్తా, రిషబ్ చద్దా ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రానికి నిషికాంత్ కామత్ దర్శకత్వం వహించారు. ప్రముఖ ఓటీటీ ఫ్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్‌లో ఈ చిత్రం అందుబాటులో ఉంది.


18. దంగల్ (2016)

రెజ్లింగ్ క్రీడ చుట్టూ తిరిగే కదే దంగల్. రెజ్లింగ్ క్రీడాకారుడైన మహావీర్ సింగ్ ఫోగట్ తన కుమార్తెలకు శిక్షణ ఇచ్చి అంతర్జాతీయ స్థాయిలో పతకాలు తీలుకొచ్చేలా కృషి చేస్తారు. ఉత్తమ భారతీయ క్రీడా చిత్రాలలో ఒకటి. అమీర్ ఖాన్, ఫాతిమా సనా షేక్, సన్యా మల్హోత్రా, సాక్షి తన్వర్, జైరా వాసిం నటించిన ఈ చిత్రం కుటుంబ సమేతంగా చూసేయొచ్చు. నితేష్ తివారీ ఈ సినిమాను తెరకెక్కించారు. 

19. జానే భీ దో యారో (1983)
1983లో వచ్చిన ఈ సినిమా విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ఈ చిత్రానికి గాను కుందన్ షాకు 1984లో ఉత్తమ తొలి దర్శకుడిగా ఇందిరా గాంధీ అవార్డు లభించింది.
భక్తి బార్వే, నసీరుద్దీన్ షా, ఓం పురి, రవి బస్వానీ, నీనా గుప్తా, సతీష్ షా, సతీష్ కౌశిక్, పంకజ్ కపూర్, అశోక్ బంతియా ప్రధాన పాత్రల్లో నటించగా.. కుందన్ షా దర్శకత్వం వహించారు. 

20. ది లంచ్‌బాక్స్ (2013)
 ఇర్ఫాన్ ఖాన్ ఉత్తమ రచనల్లో ఇది ఒకటి. ప్రపంచవ్యాప్తంగా విమర్శకుల ప్రశంసలు అందుకుంది. భారతీ అచ్రేకర్, ఇర్ఫాన్ ఖాన్, నవాజుద్దీన్ సిద్ధిఖీ, నిమ్రత్ కౌర్, నకుల్ వైద్ నటించిన ఈ సినిమాకు రితేష్ బత్రా తెరకెక్కించారు. 

21. స్టాన్లీ కా డబ్బా (2011)

కామెడీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ చిత్రం మీ హృదయాన్ని హత్తుకునేలా ఉంటుంది. ఈ సినిమాలో నటనకు పార్థో గుప్తేకు 2012లో జాతీయ అవార్డును వరించింది. దివ్య జగ్దాలే, దివ్య దత్తా, అమోల్ గుప్తే, పార్థో గుప్తే, రాజ్ జుత్షి ప్రధాన పాత్రల్లో నటించగా.. అమోల్ గుప్తా దర్శకత్వం వహించారు. హులులో ఈ చిత్రం అందుబాటులో ఉంది. 

22. దో దూని చార్ (2010)
ఈ ఫ్యామిలీ కామెడీ సినిమాలో కొత్త కారు కొనడానికి మధ్యతరగతి కుటుంబం పడుతున్న కష్టాలను అద్భుతంగా చూపించారు. రిషి కపూర్, నీతూ సింగ్ నటించిన ఈ చిత్రం ఆల్ టైమ్ అత్యుత్తమ బాలీవుడ్ సినిమాల్లో ఒకటి. ఈ చిత్రానికి 'హిందీలో ఉత్తమ చలనచిత్రం' విభాగంలో జాతీయ చలనచిత్ర పురస్కారం లభించింది. హబీబ్ ఫైసల్ తెరకెక్కించిన ఈ మూవీ.. నెట్‌ప్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. 

23. అంఖోన్ దేఖి (2014)

2014లో వచ్చిన ఈ చిత్రం ఫిలింఫేర్ అవార్డ్స్, స్క్రీన్ అవార్డులను అంఖోన్ దేఖి గెలుచుకుంది. రజత్ కపూర్, సంజయ్ మిశ్రా, బ్రిజేంద్ర కాలా, సీమా పహ్వా నటించిన ఈ సినిమాకు.. రజత్ కపూర్ దర్శకత్వం వహించారు. ఈ మూవీ నెట్‌ఫ్లిక్స్‌లో అందుబాటులో ఉంది. 

24. బావర్చి (1972)
 1970ల్లో వచ్చిన సినిమా ఉత్తమ బాలీవుడ్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా నిలిచింది. ఒకరితో ఒకరు చాలా గొడవలు చేసుకునే మధ్యతరగతి కుటుంబ సభ్యుల కథ ఆధారంగా తెరకెక్కించారు. ఈ చిత్రానికి రాజేష్ ఖన్నా 1973లో బెంగాల్ ఫిల్మ్ జర్నలిస్ట్స్ అవార్డులో ఉత్తమ నటుడి (హిందీ) అవార్డు. కన్వర్జిత్ పెంటల్ 1973లో 'ఉత్తమ హాస్య నటుడు' విభాగంలో ఫిల్మ్‌ఫేర్ అవార్డును గెలుచుకున్నారు. రాజేష్ ఖన్నా, జయ బచ్చన్, అమితాబ్ బచ్చన్, ఉషా కిరణ్, కన్వర్జిత్ పెంటల్, అస్రానీ నటించిన ఈ సినిమాను హృషికేష్ ముఖర్ తెరకెక్కించారు. 


25. జానే తు... యా జానే నా (2008)
రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌గా ఈ చిత్రం ప్రేక్షకులతో పాటు సినీ విమర్శకులకు కూడా బాగా నచ్చింది. ప్రతీక్ బబ్బర్, ఇమ్రాన్ ఖాన్, పరేష్ రావల్, జెనీలియా డిసౌజా, రత్న పాఠక్ షా, మంజరీ ఫడ్నిస్, నీరవ్ మెహతా, అయాజ్ ఖాన్, సుగంధ గార్గ్, సోహైల్ ఖాన్, నసీరుద్దీన్ షా, అలీష్కా వార్దే, కరణ్ మఖిజా, అర్బాజ్ ఖాన్ భారీ తారాగణం ఈ సినిమాలో నటించారు. అబ్బాస్ టైరేవాలా డైరెక్ట్‌ చేసిన ఈ మూవీ.. నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. 

26. జో జీతా వోహి సికందర్ (1992)
 1992లో విడుదలైన ఈ చిత్రం రెండు ఫిల్మ్‌ఫేర్ అవార్డులను గెలుచుకుంది. ఇది బాలీవుడ్‌లో వస్తున్న అత్యుత్తమ స్పోర్ట్స్ సినిమాల్లో ఒకటిగా నిలిచింది. దీపక్ తిజోరి, అమీర్ ఖాన్, కులభూషణ్ ఖర్బండా, అయేషా జుల్కా, పూజా బేడి, మామిక్ సింగ్ నటించిన ఈ సినిమాకు మన్సూర్ ఖాన్ దర్శకత్వం వహించారు.

27. కోయి... మిల్ గయా (2003)
కోయి..మిల్ గయా ఇప్పటివరకు వచ్చిన అత్యుత్తమ సైన్స్ ఫిక్షన్ బాలీవుడ్ సినిమాల్లో ఒకటి. ఈ సినిమాకు ఫిల్మ్‌ఫేర్ అవార్డ్స్, పీపుల్స్ ఛాయిస్ అవార్డ్స్, స్క్రీన్ అవార్డ్స్‌తో పాటు  పలువురి ప్రశంసలను అందుకుంది. రేఖ, హృతిక్ రోషన్, ప్రీతి జింటా, హన్సిక మోత్వాని, రజత్ బేడీ, ప్రేమ్ చోప్రా, ముఖేష్ రిషి తారాగణంతో తరకెక్కిన ఈ చిత్రానికి రాకేష్ రోషన్ దర్శకత్వం వహించారు. 

28. జిందగీ నా మిలేగీ దోబారా (2011)
ముగ్గురు స్నేహితుల కథ ఆధారంగా రూపొందించిన చిత్రం జిందగీ నా మిలేగీ దొబారా. ఈ చిత్రంలో హృతిక్ రోషన్, ఫర్హాన్ అక్తర్, కత్రినా కైఫ్, అభయ్ డియోల్, కల్కి కోచ్లిన్ నటించారు.  ఈ చిత్రం 35 అవార్డులను కైవసం చేసుకోవడంతో పాటు బాక్సాఫీస్ వద్ద హిట్‌గా నిలిచింది. జోయా అక్తర్ తెరకెక్కించిన ఈ చిత్రం నెట్‌ఫ్లిక్స్‌లో అందుబాటులో ఉంది. 

29. గుప్త్: ది హిడెన్ ట్రూత్ (1997)
 ఈ అద్భుతమైన మర్డర్ మిస్టరీని ఈ చిత్రంలో చూపించారు. బాబీ డియోల్, కాజోల్, పరేష్ రావల్, మనీషా కొయిరాలా, ఓం పురి నటించిన ఈ సినిమా బాలీవుడ్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌లో ఒకటి. రాజీవ్ రాయ్ రూపొందించిన ఈ చిత్రాన్ని జీ5లో చూసి ఎంజాయ్ చేయండి.

30. చమేలీ కి షాదీ (1986)
 1980ల నాటి ఉత్తమ కుటుంబ చిత్రాలలో చమేలీ కి షాదీ ఒకటి. అనిల్ కపూర్, అమ్జద్ ఖాన్, అమృతా సింగ్, ఓం ప్రకాష్, అన్నూ కపూర్, పంకజ్ కపూర్ నటించిన ఈ చిత్రానికి బసు ఛటర్జీ తెరకెక్కించారు. 

31. స్పెషల్ 26 (2013)
ఆదాయపు పన్ను అధికారులుగా నటిస్తూ రాజకీయ నాయకులు వ్యాపారవేత్తలను దోచుకునే ముఠా చుట్టూ తిరిగే కథే ఈ చిత్రం. ఈ సినిమా ఉత్తమ బాలీవుడ్ కుటుంబ చిత్రాలలో ఒకటిగా నిలిచింది. కాజల్ అగర్వాల్, అక్షయ్ కుమార్, అనుపమ్ ఖేర్, మనోజ్ బాజ్‌పేయి, జిమ్మీ షీర్‌గిల్ నటించిన ఈ చిత్రానికి నీరజ్ పాండే దర్శకత్వం వహించారు. 

32. సత్తె పె సత్తా (1982)
 తప్పక చూడావలసిన బాలీవుడ్ కుటుంబ కథా చిత్రాలలో ఒకటి. ఫామ్‌హౌస్‌లో జంతువుల మధ్య నివసించే ఏడుగురు సోదరుల కథాంశమే ఈ చిత్రం. అమ్జాద్ ఖాన్, అమితాబ్ బచ్చన్, సుధీర్ లూత్రియా, హేమ మాలిని, కన్వర్జిత్ పైంటల్, రంజీతా కౌర్, కన్వల్జిత్ సింగ్, విక్రమ్ సాహు, సచిన్ పిల్గావ్కర్, శక్తి కపూర్ నటించిన ఈ చిత్రాన్ని రాజ్ ఎన్. సిప్పీ రూపొందించారు. 

33. అక్టోబర్ (2018)

అక్టోబర్ వరుణ్ ధావన్ ఉత్తమ చిత్రాలలో ఒకటి. ఈ చిత్రానికి గానూ జాగ్రన్ ఫిల్మ్ ఫెస్టివల్ 2018, లయన్స్ గోల్డ్ అవార్డ్స్ 2019లో ఉత్తమ నటుడు అవార్డును గెలుచుకున్నాడు. గీతాంజలి రావు, వరుణ్ ధావన్, బనితా సంధు ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రానికి షూజిత్ సిర్కార్ దర్శకత్వం వహించారు. 

34. హిచ్కీ (2018)

ఈ స్ఫూర్తిదాయకమైన కథ బ్రాడ్ కోహెన్ రాసిన ఫ్రంట్ ఆఫ్ ది క్లాస్ ఆధారంగా రూపొందించబడింది. బాలీవుడ్‌లో ఇప్పటివరకు రూపొందించిన అత్యుత్తమ హాస్య-నాటకం చిత్రాలలో ఒకటి . రాణి ముఖర్జీ, హర్ష్ మాయర్, ఆసిఫ్ బస్రా, నీరజ్ కబీ నటించారు. సిద్ధార్థ్ పి. మల్హోత్రా దర్శకత్వం వహించిన ఈ సినిమాను ఆమెజాన్ ప్రైమ్‌వీడియోలో చూసి ఎంజాయ్ చేయండి. ఈ దీపావళికి అత్యుత్తమ బాలీవుడ్ చిత్రాల్లో మీకు నచ్చిన వాటిని కుటుంబంతో కలిసి ఆస్వాదించండి. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement