![Diwali 2022: Varun Dhawan To Kriti Sanon Bollywood Stars Diwali bash - Sakshi](/styles/webp/s3/article_images/2022/10/20/Bollywood.jpg.webp?itok=YkdafPu-)
దేశవ్యాప్తంగా దీపావళి పండుగ సంబరాలు మొదలయ్యాయి. ప్రజలు తమ ఇళ్లను అలంకరించుకోవడం ప్రారంభించారు. దీపాల పండుగ పర్వదినాన్ని తమ కుటుంబ సభ్యులతో, స్నేహితులలో అంగరంగ వైభవంగా జరుపుకునేందుకు సర్వం సిద్ధం చేసుకుంటున్నారు. ఇందుకు బాలీవుడ్ తారలు కూడా మినహాయింపు కాదు. బీటౌన్‌కి చెందిన పలువురు హీరోహీరోయిన్లు అప్పుడే దీపావళి సంబరాలను ప్రారంభించారు.
బాలీవుడ్ హీరో ఆయుష్మాన్ ఖురానా, ఆయన భార్య తాహిరా కశ్యప్‌లు ముంబైలోని తమ నివాసంలో దీపావళి పార్టీ ఇచ్చారు. ఈ పార్టీకి బాలీవుడ్ సెలబ్రిటీలు కార్తిక్ ఆర్యన్, కరణ్ జోహార్, కృతి సనన్, అనన్య పాండే, తాప్పీ పన్ను హాజరై సందడి చేశారు.
బాలీవుడ్ బ్యూటీ, ‘ఆదిపురుష్’ సీత కృతి సనన్.. తన ఇంట దీపావళి వేడుకలను ఘనంగా నిర్వహించారు. దీంతో ఆమె ఇంటికి బాలీవుడ్ నటీనటులు తరలి వచ్చారు. వరుణ్ ధావన్, అతని భార్య నటాషా దలాల్ బంగారు రంగు దుస్తుల్లో దీపాలతో పోటీగా వెలిగారు.
బాలీవుడ్ ముద్దుగుమ్మ అనన్య పాండే లెహంగా ధరించి అందరినీ మెప్పించింది. దర్శకుడు, నిర్మాత కరణ్ జోహర్ బ్లాక్ కుర్తాను ధరించి మెరిశారు. శిల్పాశెట్టి బ్రౌన్ మెరూన్ కలర్ చీరతో అలరించింది. నోరా ఫతేహి తన మెరిసే లెహంగాలో అద్భుతంగా ఉంది. తాప్సీ పన్ను మెరిసే గులాబీ రంగు చీరను ధరించింది.
Comments
Please login to add a commentAdd a comment