
వన్డే ప్రపంచకప్-2023లో వరుస విజయాలతో (8) దూసుకుపోతున్న టీమిండియా.. నెదర్లాండ్స్‌తో మ్యాచ్‌కు ముందు దీపావళి సంబురాల్లో పాల్గొంది. బెంగళూరులోని విలాసవంతమైన ఐటీసీ గార్డెనియా హోటల్‌లో జరిగిన ఈ వేడుకల్లో భారత క్రికెట్ జట్టు సభ్యులందరూ పాల్గొన్నారు. ఆహ్లాదభరితమైన వాతావరణంలో సాగిన ఈ వేడుకల్లో టీమిండియా ఆటగాళ్లు కుటుంబ సభ్యుల్లా మమేకమై ఎంజాయ్ చేశారు.
We are #TeamIndia 🇮🇳 and we wish you and your loved ones a very Happy Diwali 🪔 pic.twitter.com/5oreVRDLAX
— BCCI (@BCCI) November 12, 2023
ఈ వేడుకల్లో విరాట్-అనుష్క దంపతులు స్పెషల్ అట్రక్షన్‌గా నిలిచారు. రోహిత్, కేల్ రాహుల్, జడేజా, శార్దూల్, సూర్యకుమార్ సతీసమేతంగా ఈ వేడుకలకు హాజరయ్యారు. ఈ వేడుకల్లో శుభ్‌మన్ గిల్, ఇషాన్ కిషన్ చిన్న పిల్లాలలా సందడి చేశారు.
టీమిండియా దీపావళి సంబురాలకు సంబంధించిన వీడియోను బీసీసీఐ సోషల్‌మీడియాలో షేర్ చేసింది. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరలవుతుంది. ఈ వీడియోలో టీమిండియా ఆటగాళ్లను చూసేందుకు రెండు కళ్లు చాలవని నెటిజన్లు అంటున్నారు.
ఇదిలా ఉంటే, నెదర్లాండ్స్‌తో ఇవాళ జరుగుతున్న మ్యాచ్‌లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా భారీ స్కోర్ చేసింది. కేఎల్ రాహుల్ (63 బంతుల్లో 102; 11 ఫోర్లు, 4 సిక్సర్లు), శ్రేయస్ అయ్యర్ (94 బంతుల్లో 128 నాటౌట్; 10 ఫోర్లు, 5 సిక్సర్లు) మెరుపు శతకాలతో విరుచుకుపడటంతో పాటు రోహిత్ శర్మ (61), శుభ్‌మన్ గిల్ (51), విరాట్ కోహ్లి (51) హాఫ్ సెంచరీలతో రాణించడంతో భారత్ నిర్ణీత 50 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 410 పరుగులు చేసింది.