
బాలీవుడ్ నటి, లైగర్ బ్యూటీ అనన్య పాండేపై గాసిప్స్ గుప్పుమంటున్నాయి. ఆమె మరో నటుడితో డేటింగ్‌లో ఉన్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. బాలీవుడ్ స్టార్ నటుడితో ఆమె ప్రేమలో ఉన్నట్లు సోషల్ మీడియాలో ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. తాజాగా ఆమె ఓ పార్టీలో అతనితో కనిపించడంతో ఈ వార్తలకు మరింత బలం చేకూరుస్తున్నాయి.
'ఆషికీ-2’తో యువతకు చేరువైన నటుడు ఆదిత్య రాయ్ కపూర్. ఈ సినిమా తర్వాత ఆయనకు ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగిపోయింది. ఆయన గత కొంతకాలంగా నటి అనన్య పాండేతో ఎక్కువగా కనిపిస్తున్నారు. గతంలో కృతిసనన్ ఏర్పాటు చేసిన దీపావళి పార్టీలో వీరిద్దరు కలిసి ఫోటోలకు ఫోజులిచ్చారు. అప్పటి నుంచి అభిమానులు దృష్టంతా వీరిద్దరిపైనే పడింది.
గత రాత్రి బాలీవుడ్ డిజైనర్ మనీష్ మల్హోత్రా దీపావళి బాష్‌ను గ్రాండ్‌గా నిర్వహించాడు. దీనికి సంబంధించిన ఫొటోలను ఆమె ఇన్‌స్టా వేదికగా షేర్ చేయగా.. వారిద్దరు మాట్లాడుకుంటూ కనిపించారు. దీంతో అభిమానులు అనన్య - ఆదిత్య ప్రేమలో ఉన్నారా?’ అని మరోసారి చర్చించుకుంటున్నారు. మరోవైపు ఇటీవల కాఫీ విత్ కరణ్ షోలో పాల్గొన్న అనన్య.. ఆదిత్య అంటే తనకు ఇష్టమని చెప్పింది ఈ బాలీవుడ్ భామ. దీనిపై ఫ్యాన్స్ క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment