
దీపావళి సందర్భంగా జూ.ఎన్టీఆర్ తన ఫ్యాన్స్‌కు సర్‌ప్రైజ్ ఇచ్చాడు. పండగ రోజున తనయులు అభయ్ రామ్, భరత్ రామ్‌లతో కలిసి దిగిన ఫొటోను తారక్ షేర్ చేసి ఫ్యాన్స్‌కు డబుల్ ట్రీట్ ఇచ్చాడు. ప్రస్తుతం ఈ ఫొటో నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఇందులో ముగ్గురు ఒకే రకమైన సంప్రాదాయ దుస్తుల్లో మెరిసిపోయారు. ఇక తనయులతో తమ అభిమాన హీరోని చూసి ఫ్యాన్స్ అంతా తెగ మురిసిపోతున్నారు. దీంతో ఈ ఫొటోను పలు సామాజిక మాధ్యమాల్లో షేర్ చేస్తూ ట్రెండ్ చేస్తున్నారు.
చదవండి: సమంత మరో సంచలన నిర్ణయం!
అలాగే అబ్బాయిలు ముద్దుగా ఉన్నారంటూ కొందరు కామెంట్ చేస్తుండగా.. ఆర్‌ఆర్‌ఆర్ మూవీ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నామంటూ మరికొందరు కామెంట్ చేస్తున్నారు. కాగా తారక్ తన వ్యక్తిగత విషయాలను జాప్యంగా ఉంచుతాడు. అలాగే అభయ్ రామ్, భరత్ రామ్‌లను మీడియాకు దూరంగా ఉంచుతాడు. వారి ఫొటోలను కూడా చాలా అరుదుగా షేర్ చేస్తుంటాడనే విషయం తెలిసిందే. కాగా ప్రస్తుతం తారక్ ‘ఆర్‌ఆర్‌ఆర్’ మూవీతో బిజీగా ఉన్నాడు.ఈ మూవీ అనంతరం ఆయన కొరటాల శివ కాంబినేషన్‌లో వచ్చే ఓ సినిమాతో పాటు ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో మరో సినిమాకు సంతకం చేశాడు.
చదవండి: దీపావళికి జిగేల్‌మన్న తారలు, చూసేయండి ఫొటోలు
Comments
Please login to add a commentAdd a comment