అందుకే అమ్మ వెనుక దాక్కున్నా : వర్మ | Ram Gopal Varma Celebrates Diwali With His Mother And Sister | Sakshi
Sakshi News home page

‘నేను పిరికివాడిని.. అందుకే అమ్మ వెనుకే దాక్కున్నా’

Nov 15 2020 8:53 AM | Updated on Nov 15 2020 12:47 PM

Ram Gopal Varma Celebrates Diwali With His Mother And Sister - Sakshi

రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరే సంచలనం. ఎపుడు ఎవరినీ ఏ రకంగా ఎలా గిల్లుతాడో ఆయనకే తెలియదు. సోషల్‌ మీడియాలో ఎప్పుడూ ఎదో ఒక విషయం పై వ్యంగ్యంగా స్పందించడం అయన అలవాటు. ఆఖరుకు తనపై తాను కూడా పంచ్‌లు వేసుకుంటాడు. ఏ పని చేసినా అందరికంటే కాస్త ఢిఫరెంట్‌గా, వెరైటీగా చేయడం వర్మకు అలవాటు. తాజాగా దీపావళి వేడుకలను కూడా వర్మ తనదైన శైలీలో జరుపుకున్నాడు. తల్లి, సోదరితో కలిసి తన ఇంటి ముందు టపాసులు పేల్చాడు. ఈ సందర్భంగా వర్మ సోదరి చిచ్చుబుడ్లు పేలుస్తుండగా.. భయంతో ఆయన తల్లి చాటుకు వెళ్లాడు. ఈ వీడియోను వర్మ ట్విటర్‌లో పోస్ట్‌ చేస్తూ.. ‘ నేను సాధారణంగా చాలా పిరికివాడిని. అందుకే తల్లి వెనుకన దాక్కున్నాను’ అని క్యాప్షన్‌ ఇచ్చాడు.  
 

అలాగే వర్మ కూడా స్వయంగా చిచ్చుబుడ్లు కాల్చాడు. ఆ వీడియోని పోస్ట్‌ చేస్తూ.. దీపావళి సందర్భంగా వాయు,శబ్ధ కాలుష్యానికి నా వంతు సహకారం ఆందిస్తున్నానని వ్యంగ్యంగా చెప్పుకొచ్చాడు. ఇక మరో ట్వీట్‌లో ‘దీపావళి సందర్భంగా  వోడ్కా రుచి చూడమని నా తల్లి, సోదరిని ఒప్పించే ప్రయత్నం చేస్తున్నా’ అంటూ వోడ్కా గ్లాస్‌ తన తల్లి ఇస్తున్నట్లుగా ఉన్న ఫోటోని అని ట్వీట్‌ చేశాడు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement