'దీపావళికి మాస్ మహారాజా సర్‌ప్రైజ్.. ధమాకా టీజర్ రిలీజ్ | Mass Hero Ravi Teja DHAMAKA Teaser Released Today | Sakshi
Sakshi News home page

DHAMAKA Teaser:‍ 'అటు నుంచి ఒక బుల్లెట్‌ వస్తే.. ఇటు నుంచి దీపావళే'.. ఆకట్టుకుంటున్న మాస్‌ డైలాగ్

Published Fri, Oct 21 2022 5:02 PM | Last Updated on Fri, Oct 21 2022 5:03 PM

Mass Hero Ravi Teja DHAMAKA Teaser Released Today - Sakshi

మాస్ మహరాజా రవితేజ లేటేస్ట్ మూవీ నుంచి క్రేజీ అప్‌డేట్ వచ్చింది. యాక్షన్‌, కమర్షియల్‌ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న 'ధమాకా' టీజర్‌ను రిలీజ్ చేసింది చిత్రబృందం. దీపావళి కానుకగా రవితేజ్ ఫ్యాన్స్‌కు సర్‌ప్రైజ్‌ ఇచ్చింది. త్రినాథరావు నక్కిన దర్శకత్వంలో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ఈ ఏడాది డిసెంబర్‌ 23న థియేటర్లలోకి సందడి చేయనుంది. ఈ సినిమాలో రవితేజ సరసన శ్రీలీల కథానాయికగా నటిస్తోంది. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ పతాకాలపై టీజీ విశ్వ ప్రసాద్ నిర్మిస్తుండగా.. వివేక్ కూచిభొట్ల సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.

ఇవాళ విడుదలైన టీజర్‌ను చూస్తే రవితేజ మాస్‌ డైలాగ్స్‌, యాక్షన్‌ సీక్వెన్స్‌లు ఆకట్టుకునేలా ఉన్నాయి. టీజర్‌ను చూస్తే..' నేను మీలో విలన్‌ని చూస్తే.. మీరు నాలో హీరోని చూస్తారు' అనే డైలాగ్‌తో టీజర్ ప్రారంభమైంది. చివర్లో రవితేజ డైలాగ్ మరింత హైప్ క్రియేట్ చేస్తోంది. 'అటు నుంచి ఒక బుల్లెట్‌ వస్తే.. ఇటు నుంచి దీపావళే' వార్నింగ్‌ ఇవ్వడం రవితేజ మాస్‌ను ఓ రేంజ్‌కు తీసుకెళ్లింది. జయరాం, సచిన్ ఖేడేకర్‌, తనికెళ్ల భరణి, రావు రమేశ్‌, ఆలీ ఈ చిత్రంలో లకపాత్రలు పోషించారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement