
కరుణడ చక్రవర్తి డాక్టర్ శివరాజ్ కుమార్ పాన్ ఇండియా ఫిలిం ‘ఘోస్ట్’ శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. కన్నడ, తెలుగు, తమిళ్, మలయాళం, హిందీ భాషల్లో భారీ స్థాయిలో తెరకెక్కుతున్న ఈ సినిమాకు శ్రీని దర్శకత్వం వహిస్తుండగా సందేశ్ నాగరాజ్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. దీపావళి శుభాకాంక్షలు తెలుపుతూ ఘోస్ట్ చిత్ర బృందం కొత్త పోస్టర్ ను విడుదల చేశారు.
గాల్లోకి ఎగురుతున్న బుల్లెట్ల మధ్య గన్ పట్టుకున్న శివరాజ్ కుమార్, వెనక ఫైర్, స్మోక్ ఎఫెక్ట్ బ్యాక్ డ్రాప్ లో పోస్టర్ ఆకట్టుకుంటోంది. భారీ వేడుకతో ప్రారంభమైన ఘోస్ట్ ప్రస్తుతం రూ 6 కోట్ల వ్యయంతో భారీగా వేసిన జైల్ సెట్ లో చిత్రీకరణ జరుపుకుంటోంది.పాపులర్ మ్యూజిక్ డైరెక్టర్ అర్జున్ జన్య ఈ చిత్రానికి సంగీతాన్ని అందిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment