
Janani Song Out From RRR Movie: దర్శకధీరుడు రాజమౌళి ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న చిత్రం ఆర్ఆర్‌ఆర్. ఈ సినిమాలో యంగ్ టైగర్ జూ. ఎన్టీఆర్ కొమురం భీమ్‌గా, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజుగా నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా నుంచి వచ్చిన 'నాటు నాటు', 'దోస్తీ' పాటలు సినీ ప్రేక్షకులను, అభిమానులను ఎంతాగానో అలరించాయి. తాజాగా ఈ చిత్రం నుంచి జనని సాంగ్‌ను విడుదల చేశారు దర్శకనిర‍్మాతలు. దేశభక్తిని చాటేవిధంగా రూపొందింది ఈ పాట.
'జననీ.. ప్రియ భారత జననీ..’ అనే పాట ‘ఆర్‌ఆర్‌ఆర్’ సినిమాకి ఆత్మలాంటిదని ఎస్‌ఎస్ రాజమౌళి తెలిపారు. ఈ పాట కోసం పెద్దన్న (కీరవాణి) రెండు నెలలు శ్రమించారన్నారు. ఆయనే ఈ పాటకు లిరిక్స్ కూడా రాశారని పేర్కొన్నారు. ఈ పాటను ఒక్కరోజు ముందుగా గురువారం హైదరాబాద్‌లో విలేకరుల కోసం ప్రత్యేకంగా ప్రదర్శించారు. ఈ సందర్భంగా రాజమౌళి ‘‘డిసెంబరు మొదటి వారంలో ట్రైలర్ విడుదల చేస్తాం. వరుసగా ప్రీ రిలీజ్ వేడుకలు ఏర్పాట్లు చేస్తున్నాం. ‘జనని..’ పాటలో కనిపించని భావోద్వేగాలుంటాయి. ఒక మణిహారంలో ఉన్న దారం ఎలాగైతే కనిపించదో.. అలానే సాఫ్ట్ ఎమోషన్ కనిపించదు. కానీ సినిమా సోల్ మొత్తం ఆ పాటలోని భావోద్వేగంలోనే దాగి ఉంటుంది’’ అని అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment