RRR Making Video: Jr NTR And Ram Charan Shares RRR Making Videos - Sakshi
Sakshi News home page

RRR Movie: అలరిస్తున్న అల్లూరి, గర్జిస్తున్న భీం.. మేకింగ్‌ వీడియోలు వైరల్‌

Published Tue, Dec 21 2021 10:54 AM | Last Updated on Tue, Dec 21 2021 11:30 AM

RRR Movie Making Videos Of Komuram Bheem And Alluri Sitaramaraju - Sakshi

RRR Movie Making Videos: దర్శక ధీరుడు రాజమౌళి, యంగ్‌ ​​టైగర్‌ ఎన్టీఆర్, మెగా పవర్‌ స్టార్‌ రామ్‌ చరణ్‌ ముగ్గురి కాంబినేషన్‌లో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన చిత్రం ఆర్‌ఆర్‌ఆర్‌ (రౌద్రం.. రణం.. రుధిరం). భారీ బడ్జెట్‏తో నిర్మిస్తున్న ఈ సినిమాలో కొమురమ్‌ భీమ్‌గా తారక్‌, అల్లూరి సీతారామరాజుగా చరణ్‌ పాత్రలు పోషిస్తున్నారు. చెర్రీకి జోడిగా  బాలీవుడ్‌ క్యూటీ ఆలియాభట్‌, తారక్‌ సరసన హాలీవుడ్‌ నటి ఒలీవియా మోరీస్‌ నటించారు. పాన్‌ ఇండియా చిత్రంగా నిర్మితమైన ఈ చిత్రం (RRR Movie) సంక్రాంతి కానుకగా 2022 జనవరి 7న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే విడుదలైన  పాటలు, ట్రైలర్‌ సినిమాపై బడ్జెట్‌కు మించి హైప్‌ను క్రియేట్‌ చేశాయి. 

ఎంతగానో ఎదురుచూస్తున్న 'ఆర్‌ఆర్‌ఆర్‌' (RRR) చిత్రం విడుదలకు ఇంకా కొన్ని రోజులే మిగిలాయి. సినిమా రిలీజ్‌కు ముందు చిత్ర ప్రమోషన్స్‌ను కూడా భారీగా చెస్తున్నారు. ఇటీవల ముంబైలో గ్రాండ్‌గా ప్రీరిలీజ్‌ ఈవెంట్‌ నిర్వహించారు దర్శకనిర్మాతలు. అంతకుముందు అలియా భట్‌ సీతగా మారిన మేకింగ్ వీడియోను షేర్ చేసిన చిత్ర బృందం తాజాగా కొమురమ్‌ భీం, అల్లూరి సీతారామరాజు పాత్రల చిత్రీకరణను సోషల్‌మీడియా వేదికగా పంచుకుంది. కొమురం భీం, అల్లూరి సీతరామరాజులు చేసిన యాక్షన్‌ సీన్స్‌ మేకింగ్ వీడియోలను తారక్, చెర్రీ తమ ఇన్‌స్టా గ్రామ్‌ ఖాతాల్లో అభిమానులతో పంచుకున్నారు. 

అల్లూరి సీతరామరాజు మేకింగ్ వీడియోలో చెర్రీ ఓ వైపు నవ్వుతూ మరోవైపు పాత్రలోకి పరాకయ ప్రవేశం చేశాడు. క్యాజువల్ జీన్స్‌, షర్ట్‌తో ఎంట్రీ ఇచ్చిన రామ్‌ చరణ్‌ వెంటనే పోలీసు యూనిఫామ్‌ వేసుకొని నిలుచున్న విజువల్స్‌తో ప్రారంభమవుతుంది వీడియో. అందులో చరణ్‌ రిహాసల్స్‌, సీన్‌లో ఎమోషన్స్‌, బాక్సింగ్‌ ప్రాక్టీస్ అబ్బురపరిచాయి. అలియా భట్‌తో సీన్‌ గురించి నవ్వకుంటూ చర్చించుకోవడం కూడా వీడియోలో మనం చూడవచ్చు. 

ఇక కొమురం భీం పాత్రకు సంబంధించిన వీడియోలో ఎన్టీఆర్‌ను భీంగా తయారు చేయడం చూపించారు. యాక్షన్‌ సన్నివేశాలు, బైక్‌ రైడింగ్ ప్రాక్టీస్‌ చేయడం కనులవిందుగా ఉంది వీడియో. అక్కడక్కడ తారక్‌ నవ్వడం, మైక్‌లో ఏవో సూచనలు ఇవ్వడం, డైలాగ్‌లు ప్రాక్టీస్‌ చేయడం ఫ్యాన్స్‌ పండగ చేసుకునేలా ఉంది. వీడియో చివర్లో ఎన్టీఆర్‌ గర్జిస్తూ అడవిలో పరిగెత్తడం చూపించారు. ఈ వీడియోలను 'వీ ఆర్‌ ఇన్‌ ది మేకింగ్' అంటూ ఎండ్‌ చేశారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement